Devarakonda: ప్రభుత్వాసుపత్రిలో పసికందు మృతి.. ఆస్పత్రిపై బంధువుల దాడి

by Ramesh Goud |   ( Updated:2025-01-08 13:22:49.0  )
Devarakonda: ప్రభుత్వాసుపత్రిలో పసికందు మృతి.. ఆస్పత్రిపై బంధువుల దాడి
X

దిశ, వెబ్ డెస్క్: వైద్యుల(Doctors) నిర్లక్ష్యం(Negligence) కారణంగా పసికందు మృతి(Baby Died) చెందిందన్న ఆరోపణలతో ఆసుపత్రిపై దాడి చేశారు. ఈ ఘటన దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి(Devarakonda Government Hospital)లో జరిగింది. ఘటన ప్రకారం దేవరకొండ పరిసర గ్రామం నుంచి ఓ మహిళ ప్రసవం కోసం ప్రభుత్వాసుపత్రికి వచ్చింది. మహిళకు డాక్టర్లు డెలివరీ చేయగా.. శిశువు మృతి చెందింది. దీంతో ఆగ్రహానికి గురైన బంధువులు ఆసుపత్రిపై దాడికి తెగబడ్డారు. గవర్నమెంట్ హస్పిటల్ పై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. పసికందు మృతికి వైద్యుల నిర్లక్షమే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై వైద్యులను అడగగా.. సరైన సమాధానం ఇవ్వట్లేదని బాధితురాలి బంధువులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed