Sabarimala: శబరిమలకు పెద్ద ఎత్తున పోటెత్తిన భక్తులు.. ఆయలం కిటకిట

by Ramesh Goud |
Sabarimala: శబరిమలకు పెద్ద ఎత్తున పోటెత్తిన భక్తులు.. ఆయలం కిటకిట
X

దిశ, వెబ్ డెస్క్: మకరసంక్రాంతి(Makar Sankranti) సందర్భంగా శబరిమల(Sabarimala)కు భక్తులు పెద్దఎత్తున పోటెత్తారు. భారీ జన సందోహం మధ్య శమరిమల దేవాలయం కిటకిటలాడుతోంది. సంక్రాంతి పండుగ(Sankranti festival) నేపథ్యంలో అయ్యప్ప మాల ధరించిన స్వాములు ఇరుముడి సమర్పించేందుకు శబరిమలకు క్యూ కట్టారు. ఈ నెల 14 వరకూ ఆలయం తెరిచి ఉండటం.. సమయం దగ్గర పడుతుండటంతో రద్దీ భారీగా పెరిగింది. శబరిమల సన్నిధానం నుంచి పంబ వరకూ క్యూలైన్ లో భక్తులు వేచి ఉన్నారు. దీంతో భక్తులు దర్శనానికి గంటల కొద్ది వేచి చూడాల్సి వస్తోంది. 24 గంటల వ్యవధిలో లక్ష మందికి పైగా భక్తులు స్వామిని దర్శించుకున్నారని దేవస్థానం బోర్డు వెల్లడించారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేశామని, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed