ISRO: ఇస్రో కొత్త ఛైర్మన్‌గా వి నారాయణన్‌.. ఉత్తర్వులు ఇచ్చిన కేంద్రం

by Mahesh |
ISRO: ఇస్రో కొత్త ఛైర్మన్‌గా వి నారాయణన్‌.. ఉత్తర్వులు ఇచ్చిన కేంద్రం
X

దిశ, వెబ్ డెస్క్: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO) కొత్త ఛైర్మన్, అంతరిక్ష శాఖ కార్యదర్శిగా డాక్టర్ వీ నారాయణన్‌(Dr V Narayanan) నియమితులయ్యారు. అయితే ప్రస్తుతం ఇస్రో చీఫ్ గా కొనసాగుతున్న ఎస్ సోమనాథ్(S Somnath) జనవరి 14న పదవీ విరమణ పొందనున్నారు. దీంతో అదే రోజున ISRO కొత్త చీఫ్‌గా వీ నారాయణన్‌ ఇస్రో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇస్రో చైర్మన్‌, స్పేస్ డిపార్ట్‌మెంట్ సెక్రెటరీగా డాక్టర్ వీ నారాయణన్‌ను నియమించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం(Central Govt) మంగళవారం సాయంత్రం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం నారాయణన్ జనవరి 14 నుంచి రెండేళ్లపాటు ఇస్రో చీఫ్‌(ISRO Chief)గా కొనసాగుతారు. ప్రస్తుతం ఆయన కేరళలో వలియమాలాలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్(LPSC) డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు. రాకెట్, స్పేస్‌క్రాఫ్ట్ ప్రొపల్షన్ సెక్టర్‌లో నారాయణన్ కు నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. జీఎస్ఎల్వీ ఎంకే 3 కోసం సీఈ 20 క్రయోజనిక్ ఇంజన్ అభివృద్ధిలో నారాయణన్(Narayanan) కీలక పాత్ర పోషించారు. ఆయన సారథ్యంలో అనేక ఇస్రో ప్రయోగాలకు 183 లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్, కంట్రోల్ పవర్ ప్లాంట్లను ఎల్‌పీఎస్‌సీ అందించింది.

Advertisement

Next Story

Most Viewed