AP Govt.: వృద్ధులకు భారీ గుడ్ న్యూస్.. ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

by Shiva |
AP Govt.: వృద్ధులకు భారీ గుడ్ న్యూస్.. ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: కనిపెంచిన తల్లిదండ్రులను ఎదిగొచ్చిన కొడుకులు నడిరోడ్లపైనే నిర్దాక్షిణ్యంగా వదిలేస్తున్నారు. వారి నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు చేతికి అందగానే.. బుక్కెడు బువ్వ పెట్టకుండా ఉసూరుమంటూ ఇంట్లో నుంచి గెంటేస్తున్నారు. దీంతో ఆ పండుటాకులు ఎక్కడి వెళ్లాలో తెలియని అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ దుర్భర జీవితం గుడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే వృద్ధులకు అండగా నిలబడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక వేళ వయసు మీద పడిన తల్లిదండ్రులను వారసులు పట్టించుకోని పక్షంలో వారికి రాసిచ్చిన ఆస్తిని తిరిగి వెనక్కి తీసుకునేలా సర్కార్ నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్టార్లకు (Sub Registrars) ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసిది. 2007 సీనియర్ సిటిజన్స్ చట్టం (2007 Senior Citizens Act) ప్రకారం.. ఎవరైనా తల్లిదండ్రులు తమ వారసులు తమను సరిగా చూడటం లేదని జిల్లా ట్రిబ్యూనల్ (District Tribunal) అధికారిగా ఉండే ఆర్డీవో (RDO)కు పిటిషన్‌ ఇచ్చి ఫిర్యాదు చేయవచ్చని అధికారులు వెల్లడించారు. ఆయితే, విచారణలో తల్లిదండ్రులు చెప్పింది నిజమని తేలితే.. ఆర్డీవో (RDO) ఇచ్చే ఆదేశాల ఆధారంగా సబ్ రిజిస్టార్ (Sub Registrars) రాసిచ్చిన ఆస్తుల తాలూకా డాక్యుమెంట్లను రద్దు చేయనున్నారు. దీంతో తిరిగి ఆస్తి మొత్తం తల్లిదండ్రులకు పేరు మీదికి బదిలీ కానుంది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని వృద్ధలు, తల్లిందండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed