తల్లి కాబోతున్న బాలకృష్ణ హీరోయిన్.. నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలు

by Kavitha |
తల్లి కాబోతున్న బాలకృష్ణ హీరోయిన్.. నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలు
X

దిశ, సినిమా: ‘తకిట తకిట’ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ హరిప్రియ అందరికీ సుపరిచితమే. ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని నటించిన ‘పిల్ల జమిందార్’ సినిమాతో మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో అచ్చతెలుగు ఆడపిల్లలా నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ‘అబ్బాయి క్లాస్- అమ్మాయి మాస్’, ‘ఈ వర్షం సాక్షిగా’, ‘జై సింహా’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే ఈ బ్యూటీకి టాలీవుడ్‌లో అనుకున్నంత స్టార్ డమ్ అయితే రాలేదు.

కానీ కన్నడ ఇండస్ట్రీలో మాత్రం స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకున్నది. ఇక ఈ భామ కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే 2023లో నటుడు వశిష్టతో ఏడడుగులు వేసింది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా హరిప్రియ ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులోబేబీ బంప్‌తో తన భర్తతో కలిసి ఫొటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక వాటిని నెటిజన్లు ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు. అలాగే హ్యాపీ అండ్ సేఫ్ డెలివరీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా వశిష్ట.. ‘కేజీఎఫ్’, ‘నారప్ప’, ‘నయీం డైరీస్’, ‘ఓదెల రైల్వే స్టేషన్’, ‘ఏవమ్’ వంటి సినిమాల్లో విలన్‌ క్యారెక్టర్స్‌లో నటించి మెప్పించాడు.

Advertisement

Next Story

Most Viewed