పట్టభద్రుల ప్రచారం ఏది.. ఆసక్తి చూపని పార్టీలు?

by Jakkula Mamatha |
పట్టభద్రుల ప్రచారం ఏది.. ఆసక్తి చూపని పార్టీలు?
X

దిశ ప్రతినిధి, నిర్మల్: గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల పై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతటా నిరాసక్తత నెలకొంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటిదాకా అభ్యర్థులను ప్రకటించకపోవడం, ప్రచారం సైతం అసలు చేయకపోవడం చూస్తే ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయ కోలాహలం కనిపించడం లేదు.

అభ్యర్థులను ప్రకటించని పార్టీలు..

రాజకీయ పార్టీల కన్నా ఎక్కువగా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారి పేర్లే శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం ప్రచారం వినిపిస్తున్నది. కాంగ్రెస్ నుంచి ఆదిలాబాద్, నిజామాబాద్ మెదక్, కరీంనగర్ జిల్లాల శాసన మండలి గ్రాడ్యుయేట్స్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైంది. అయితే ఆయన కూడా పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదన్న సమాచారం మేరకు కాంగ్రెస్ పార్టీలోనూ ఎన్నికల ప్రచారం పై దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు. పట్టభద్రుల నమోదు డిసెంబర్ 9 దాకా పెంచగా.. ఓటర్ల తుది జాబితా వెలువడలేదు. కాగా భారతీయ జనతా పార్టీ, భారత్ రాష్ట్ర సమితి పార్టీలు అభ్యర్థుల పేర్లను ఇప్పటిదాకా ఖరారు చేయలేదు. అభ్యర్థుల ఎంపికపై ఇంకా చర్చ కూడా జరుగుతున్న పరిస్థితులు కనిపించడం లేదు ఈ కారణంగా ఎమ్మెల్సీ ఎన్నికల పై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిరాశక్యత నెలకొంది.

స్వతంత్ర అభ్యర్థులుగానే బరిలోకి దిగేందుకు పలువురు ముఖ్య వ్యక్తులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇంకా దీనిపై స్పష్టత లేదు. కాంగ్రెస్ ప్రకటించిన తర్వాతనే మిగతా పార్టీలు అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి భారత్ రాష్ట్ర సమితి తరఫున బరిలో నిలిచేందుకు ఎవరు కూడా ఆసక్తి చూపుతున్న దాఖలాలు లేవు. బీజేపీ నుంచి మంచిర్యాల జిల్లాకు చెందిన రఘునాథ్ నిర్మల్ జిల్లాకు చెందిన వి సత్యనారాయణ గౌడ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసిన ప్రసన్న హరికృష్ణ కరీంనగర్ కు చెందిన విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి నిజామాబాద్ జిల్లాకు చెందిన డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన గంగాధర్ తదితరులు పోటీలో నిలుస్తున్నారు. వీరికి రాజకీయ పార్టీలు టికెట్ ఇస్తాయి. లేదంటే స్వతంత్రులుగానే బరిలో నిలుస్తారా అన్నది ఆసక్తిగా మారింది.

Advertisement

Next Story