Road Accidents: ఘోర రోడ్డుప్రమాదాలు.. ఏడుగురు మృతి

by Rani Yarlagadda |   ( Updated:2024-12-01 04:31:07.0  )
Road Accidents: ఘోర రోడ్డుప్రమాదాలు.. ఏడుగురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం (Anantapuram) జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. విడపనకల్లులో కారు చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద స్థలంలో కారు నుజ్జు నుజ్జవ్వగా.. మృతదేహాలు చెల్లా చెదురుగా పడి ఉండటంతో.. ఆ ప్రాంతం భీతావహంగా కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదం మరణించిన వారంతా బళ్లారికి చెందిన ఓపీడీ ప్రభుత్వ ఆస్పత్రి (OPD Government Hospital) వైద్యులు యోగేశ్, గోవిందరాయ, అమరేశ్ లుగా గుర్తించారు. హాంకాంగ్ విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.

భోగాపురంలో నలుగురు దుర్మరణం

విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి గ్రామానికి సమీపంలో నేషనల్ హైవేపై జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో నలుగురు శ్రీకాకుళం జిల్లా (Srikakulam DT) వాసులు మరణించారు. కారు టైర్ పంక్చర్ కావడంతో డివైడర్ ను దాటి అవతలి రోడ్డులో వస్తున్న లారీని ఢీ కొట్టింది. మృతి చెందిన వారిని శ్రీకాకుళంకు చెందిన గవిడి వెంకట రమణ కౌశిక్ (27), మొడి జయేశ్ (20), వడ్డి మణిబాల (24) వడ్డి అభినవ్ (27) అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Advertisement

Next Story

Most Viewed