- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంత నిర్లక్ష్యమా.. ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లలకు భద్రతేది ?
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ప్రైవేట్ పాఠశాలల్లో చిన్నారులకు రక్షణ కరువవుతోంది. మామూళ్ల మత్తులో పడి విద్యార్థులను సరిగా పట్టించుకోవడం లేదు. విద్యార్థులకు చదువు చెప్పాల్సిన పాఠశాలలు వారి మరణాలకు కేంద్రంగా మారుతున్నాయి. యజమాన్యాలు ఫీజుల రాబడి చూసుకుంటున్నారే తప్ప.. విద్యార్థులకు భద్రత కల్పించడం లేదు. స్కూల్ యాజమానుల నిర్లక్ష్యం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. బడిబాటలో విద్యార్థుల బతుకులు చిద్రమవుతున్నాయి. చదువు మాట పక్కన పెడితే వారి ప్రాణాలకు సేఫ్టీ లేకుండా పోతోంది. ఇందుకు నిజామాబాద్ నగరంలోని కాకతీయ స్కూల్ లో జరిగిన తొమ్మిదో తరగతి విద్యార్థి శివజశ్విత్ రెడ్డి మరణమే కారణం. వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థి పరిస్థితి గురించి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా జాప్యం చేసి విద్యార్థి చావుకు కారణమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. కాకతీయ స్కూల్ యాజమాన్యం తీరు గురించి అందరూ మాట్లాడుకునే మాటలివే. లక్షలకు లక్షలు ఫీజులు కట్టి పిల్లలను ప్రైవేట్ స్కూల్ లో చేర్పించే తల్లిదండ్రులకు కంటిమీద కునుకును దూరం చేస్తోంది. కన్ను మూసినా, తెరిచినా స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమే అనుక్షణం తలుచుకుంటున్నారు. శివజశ్విత్ రెడ్డి మృతి ఘటన ఆ స్కూల్ లో చదువుకుంటున్న ఇతర విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనలోకి నెట్టేసింది.
ఉమ్మడి జిల్లాకు చెందిన వేలాది మంది విదార్థులు నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, ఆర్మూర్ తదితర పట్టణాల్లోని పలు ప్రైవేట్ పాఠశాలల్లో, కాలేజీల్లో చదువుకుంటున్నారు. హాస్టళ్లలో ఉండి చదివే విద్యార్థులు హాస్టళ్లలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో చాలా మంది తల్లిదండ్రులు బయటకు చెపుతున్నారు. యాజమాన్యాలు ఈ విషయాలను బయటికి తెలియనివ్వకుండా జాగ్రత్తలు పాటిస్తున్నాయి. హాస్టళ్లలో ఎలాంటి సౌకర్యాలు లేకున్నా అడ్జస్ట్ అయ్యేలా స్కూల్ యాజమాన్యం విద్యార్థులను అలా ట్యూన్ చేస్తుందని పలువురు విద్యార్థుల పేరెంట్స్ చెపుతున్నారు.
చన్నీళ్ల స్నానమే గతి..
హాస్టళ్లలో విద్యార్థులు ఎముకలు కొరికే చలి వేస్తున్నా చన్నీళ్ల స్నానమే చేయాలనే కండీషన్లు ఉంటాయని చెపుతున్నారు. ప్రైమరీ సెక్షన్ విద్యార్థులతో పాటు, హై స్కూల్, కాలేజీ విద్యార్థులు కూడా చన్నీళ్ల స్నానమే చేస్తారని చెపుతున్నారు. వేన్నీళ్ల స్నానం చేసే అవకాశాలు హాస్టళ్లలో తక్కువగా ఉంటాయని చెపుతున్నారు. ఎవరైనా ఇంటి నుండి హీటర్ తీసుకెళితే ఆ హీటర్ ను కూడా గదిలో వాడనివ్వరని చెపుతున్నారు. ఒంట్లో సుస్తీగా ఉన్నా, జలుబు చేసినా, జ్వరం వచ్చినా చన్నీళ్ల స్నానమే చేయాల్సి ఉంటుందంటున్నారు. కడుపులో నొప్పిగా ఉందని, తల తిప్పుతుందని చెప్పినా వార్డెన్లు సీరియస్ గా తీసుకోరని, అదే తగ్గిపోతుందిలే వెళ్లి రెస్ట్ తీసుకొమ్మని ఉచిత సలహాలిస్తారని చెపుతున్నారు. కొన్నిసార్లు అసలు ఏం మెడిసిన్ కూడా ఇవ్వకుండా రెస్ట్ తీసుకునే అవకాశం కూడా ఇవ్వరని చెపుతున్నారు. వందల మంది ఉండే హాస్టల్ క్యాంపస్ బిల్డింగులో విద్యార్థులను పర్యవేక్షించడానికి సరిపడా సిబ్బంది కూడా ఉండరని, డ్యూటీలో ఉన్న సిబ్బంది కూడా పిల్లల పట్ల శ్రద్ధతో వ్యవహరించడం లేదనే ఆరోపణలున్నాయి. తమ బాధలను విద్యార్థులు అక్కడి సిబ్బందికి చెప్పుకోవాలంటే భయపడి నొప్పిని భరిస్తూ అలాగే బాధతో విలవిల్లాడతారని కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు చెపుతున్నారు.
ప్రైవేట్ స్కూళ్ల పై ఫిర్యాదులు చేసినా పట్టించుకోని యంత్రాంగం..
ప్రైవేట్ స్కూళ్ల పై పలువురు పేరెంట్స్ గతంలో చాలా సార్లు కంప్లెయింట్స్ చేశారని, ఎప్పుడు కూడా సీరియస్ గా స్పందించి ఎలాంటి చర్యలు తీసుకోలేదని నగరానికి చెందిన ఓ పేరెంట్స్ అన్నారు. తల్లిదండ్రులకు సీరియస్ గా కనిపించే సమస్యలు యాజమాన్యానికి, సిబ్బందికి చాలా చిన్నవిగా కనిపిస్తాయని చెపుతున్నారు. ఒక్కో సారి పేరెంట్స్ సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేస్తే పిల్లలను టార్గెట్ చేసి ఇబ్బందులు పెడుతుంటారని వారంటున్నారు.
వేలాది మంది విద్యార్థులు చదువుతున్నారు..
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాకతీయ విద్యాసంస్థలకు మంచి పేరుంది. మంచి పేరుతో పాటు అప్పుడప్పుడూ జరిగిన కొన్ని సంఘటనల తాలూకు మరకలు కూడా ఉన్నాయి. ఎన్నో క్యాంపస్ లతో ఓ గల్లీ మొత్తం విస్తరించుకుని ఉన్న కాకతీయ విద్యాసంస్థల్లో వేలాది మంది విద్యార్థులు చదువుతున్నారు. కానీ, హాస్టళ్లలో సౌకర్యాలు అంతంత మాత్రమేనని కొందరు విద్యార్థుల తల్లిదండ్రులంటున్నారు. పిల్లలను తమ సొంత పిల్లల్లాగా చూసుకోవాల్సి ఉన్నా పెద్దగా పట్టించుకోరనే అపవాదు యాజమాన్యంపై ఉంది. చదువు విషయంలో తప్ప డైట్, ఫెసిలిటీల విషయంలో అంతగా ఫోకస్ పెట్టడం లేదని, ఇదేమని అడిగితే, పిల్లలకు చదువు మీద తప్ప ఏ ఇతర విషయాలపై ధ్యాస ఉండవద్దని చెపుతున్నారని కొందరు పేర్కొంటున్నారు.
శివజశ్విత్ రెడ్డి మృతి అనేక అనుమానాలు..
కాకతీయ విద్యాసంస్థ యమున క్యాంపస్ హాస్టల్ లో తొమ్మిదో తరగతి విద్యార్థి శివజశ్విత్ రెడ్డి మృతి ఘటన ఎన్నో అనుమానాలను, మరెన్నో ప్రశ్నలను ఉత్పన్నం చేసింది. విద్యార్థి మరణం వెనక కారణాలను విశ్లేషిస్తే స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమే నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తోందనడంలో ఎలాంటి అనుమానాలు లేవని ప్రతి ఒక్కరు చెపుతున్నారు. జశ్విత్ రెడ్డి చనిపోయే కన్నా ముందు వారం రోజులుగా జ్వరంతో, జలుబుతో బాధ పడుతున్నట్లు తోటి విద్యార్థులు చెపుతున్నారు. పలు మార్లు వాంతులు, విరేచనాలు కూడా అయ్యాయని చెపుతున్నారు. అయినప్పటికీ జశ్విత్ రెడ్డి పేరెంట్స్ కు సమాచారం ఇవ్వలేదని, హాస్పిటల్ లో కూడా చూపించకుండా నిర్లక్ష్యం చేశారని హాస్టల్ విద్యార్ధుల్లో కొంతమంది చెప్పినట్లు తెలుస్తోంది. బ్లడ్ వామిటింగ్ కూడా చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. హాస్టల్ సిబ్బంది జశ్‌విత్ కు టాబ్లెట్ ఇచ్చారని చెపుతున్నారు. ఏం టాబ్లెట్ ఇచ్చారో.. దానికి ఎక్స్ పైరీ డేట్ ఉందో లేదో తెలియదు.. ఫుడ్ పాయిజన్ ఏదైనా అయ్యిందేమో కూడా సరిగా చెప్పడం లేదు. సింపుల్ గా యాజమాన్యం గుండెపోటుతో విద్యార్థి చనిపోయినట్లు చెబుతున్నారు.
అధికారుల తీరు దారుణం..
విద్యార్థి మృతి ఘటనలో యాజమాన్యం తీరు ఎలా ఉన్నా.. అధికారుల తీరు మరీ దారుణంగా ఉంది. అధికారులు, విద్యార్థి సంఘాలు ఈ విషయంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవాలను సమాజం ముందు బట్ట బయలు చేయాల్సిన మీడియా తీరు కూడా తీవ్ర విమర్శలను మూటగట్టుకుంది. అన్ని వ్యవస్థలు అమ్ముడుపోయాయని సమాజం కోడై కూస్తున్నా పట్టనట్లు వ్యవస్థలు వ్యవహరిస్తున్నాయి. చనిపోయింది మన రక్తసంబంధీకుడు కాదనే అభిప్రాయమో, వాస్తవాలు దాచి నేరానికి సహకరిస్తే వచ్చే ఆర్థిక ప్రయోజనం కోసమో, ఏదైతేనేం విద్యార్థి మృతికి కారణాలను వెలికి తీసే పనిలో అధికారులు, మీడియా, విద్యార్థి సంఘాలు ఘోరంగా విఫలమయ్యాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవస్థలన్నీ స్కూల్ యాజమాన్యానికి అమ్ముడు పోయాయని, నా కొడుకు మృతి విషయంలో న్యాయం చేయడంలో మాకు అన్యాయం చేశారని బాధిత తండ్రి భాస్కర్ రెడ్డి దుమ్మెత్తి పోస్తున్నారు. మా కడుపు కోత వ్యవస్థలో ఏ స్తంభానికి కనిపించడం లేదా ? అని ప్రశ్నిస్తున్నారు.
విచారణ చేస్తే తప్ప అసలు నిజం బయట పడదు..
ఇప్పటికైనా పోలీసులు, విద్యాశాఖ అధికారులు స్పందించి లోతుగా విచారణ చేస్తే అసలు విషయం బయటపడే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. విద్యార్థి చనిపోయే ముందు రోజు రాత్రి అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే హాస్టల్ గదిలో ఉన్న వారితో పాటు మిగతా విద్యార్థులను కూడా విచారిస్తేనే అసలు విషయాలు బయట పడతాయంటున్నారు.