- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రికార్డు సృష్టించిన స్మృతి మంధాన.. ఆ జాబితాలో ఎన్నో స్థానమంటే..!
దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా మహిళ జట్టు 88 పరుగులతో భారీ విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ 143, స్మృతి మంధాన 44 పరుగులు చేస్తూ.. ఇంగ్లాండ్ బౌలర్లను హడలెత్తించారు. అయితే ఓపెనర్ స్మృతి మంధాన 51 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో.. 44 పరుగులతో అద్భుతంగా రాణించింది. దాంతో స్మృతి మంధాన అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకుంది.
ఆ మ్యాచ్‌లో 44 పరుగులతో రాణించిన స్మృతి మంధాన.. వన్డే కెరీర్‌లో 3000 పరుగులు పూర్తిచేసిన ప్లేయర్‌గా ఘనత సాధించింది. వన్డే ఫార్మట్‌లో వేగంగా 3000 పరుగులు పూర్తిచేసుకున్నటీమిండియా మూడో ప్లేయర్‌గా నిలిచింది. ఈ జాబితాలో 3000 వన్డే పరుగులు పూర్తి చేసిన ప్లేయర్లలో ధావన్ 72 ఇన్నింగ్స్‌ల్లో తొలి స్థానంలో , కోహ్లి 75 ఇన్నింగ్స్‌ల్లో రెండో స్థానంలో ఉన్నాడు. అయితే స్మృతి మంధాన 76 ఇన్నింగ్స్‌లో వన్డే ఫార్మట్‌లో వేగంగా 3000 పరుగులు పూర్తిచేసుకున్న టీమిండియా మూడో ప్లేయర్‌గా మంధాన నిలిచింది.