- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముంబైపై రోహిత్ శర్మ సెన్సేషనల్ కామెంట్స్.. ఎమ్‌ఐకు టీమిండియా కెప్టెన్ గుడ్ బై..?
దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలోనే అత్యధిక టైటిల్స్ గెలిచిన జట్టు ముంబై ఇండియన్స్. టీమిండియా కెప్టెన్, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఐదు టైటిల్స్ నెగ్గింది. అయితే, 2024 ఐపీఎల్ సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజ్ ఎవరూ ఊహించని సంచలన నిర్ణయం తీసుకుంది. జట్టుకు ఐదు టైటిల్స్ అందించి.. విజయవంతంగా టీమ్‌ను లీడ్ చేస్తోన్న రోహిత్ శర్మను కెప్టెన్సీ నుండి తొలగించింది. గతంలో ముంబైకి ఆడిన ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యాను గుజరాత్ నుండి తీసుకుని అతడి ఎమ్‌ఐ జట్టు పగ్గాలు అప్పగించింది. దీంతో ముంబై ఇండియన్స్ యాజమాన్య తీరుపై రోహిత్ శర్మ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీమిండియాకు సారథ్యం వహిస్తోన్న రోహిత్‌ను పక్కన పెట్టి పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించడమేంటని ఘోరంగా ట్రోల్ చేశారు.
హార్ధిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించడం ముంబై టీమ్‌లోని కొందరు ప్లేయర్లకు కూడా ఇష్టం లేదని ప్రచారం జరిగింది. పాండ్యా ఎంట్రీతో ముంబై జట్టుగా రెండు వర్గాలుగా చీలిందని వార్తలు వినిపించాయి. ఈ ఎఫెక్ట్ కూడా ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌పై స్పష్టం కనిపించింది. సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన ముంబై కేవలం నాలుగింట్లో విజయం సాధించి.. 8 మ్యాచుల్లో చిత్తుగా ఓడి ఫ్లే ఆఫ్స్ రేస్ నుండి నిష్ర్కమించింది. మరోవైపు రోహిత్ శర్మ కూడా ముంబై ఇండియన్స్‌కు గుడ్ బై చెబుతాడని, ఇదే అతడికి ఎమ్‌ఐతో లాస్ట్ సీజన్ అని క్రీడా వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. రోహిత్ లక్నో లేదా కోల్‌కతా జట్టు వెళ్లే అవకాశం ఉందని వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ క్రమంలో రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వినిపిస్తోన్న వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి.
ఇటీవల ముంబై ఇండియన్స్, కోల్ కతా జట్లు తలపడ్డాయి. ఈ సందర్భంగా మ్యాచ్ ప్రారంభానికి ముందు కోల్ కతా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌తో రోహిత్ శర్మ ముచ్చటించారు. అది నా ఇల్లు, దేవాలయం లాంటిదని దానని నేనే నిర్మించానని రోహిత్ అభిషేక్ నాయర్‌తో అన్నారు. కానీ ఇప్పుడు అది తనకు అవసరం లేదని, నాకు ఇదే చివరిది కదా అని టీమిండియా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ మాట్లాడుకున్న వీడియో క్రీడా వర్గాల్లో సంచలంగా మారింది. అయితే, ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజ్ తీరుపై తీవ్ర అసంతృప్తితోనే రోహిత్ శర్మ అలాంటి ఎమోషనల్ కామెంట్స్ చేశాడని హిట్ మ్యాన్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఇక, రోహిత్ శర్మకు ముంబైతో బంధం ముగిసిందని.. ఎమ్‌ఐతో అతడికి ఇదే లాస్ట్ సీజన్ కావొచ్చని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.