అవసరమైతే ఐపీఎల్ ఆడటం మానేయండి : రవి శాస్త్రి

by Vinod kumar |
అవసరమైతే ఐపీఎల్ ఆడటం మానేయండి : రవి శాస్త్రి
X

దిశ, వెబ్‌డెస్క్: మరో 7 రోజుల్లో ఐపీఎల్ 2023 సీజన్‌కు తెరలేవనుంది. ఈ ధనాధన్ లీగ్‌లో స్టార్ ఆటగాళ్లంతా తమ ఫిట్‌నెస్ కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో రవి శాస్త్రి ఆటగాళ్లతో పాటు బీసీసీఐకి కీలక సూచనలు చేశాడు. 'కీలక ఆటగాళ్లు గాయాల బారినపడుతుండటం ఆందోళన కలిగించే విషయం. మేం క్రికెట్‌ ఆడే సమయంలో ఇన్ని సదుపాయాలు లేవు. అయినా, 8-10 ఏళ్లు సులభంగా ఆడటం మీరంతా చూశారు. మా తరంలో చాలా మంది ఏడాదిలో 8-10 నెలల పాటు ఆడేవారు. వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో భారత స్టార్ ఆటగాళ్లు ఐపీఎల్ ఆడకుండా ఉండాలని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి సూచించాడు. ప్రపంచకప్‌ని దృష్టిలో ఉంచుకుని భారత కీలక ఆటగాళ్ల మ్యాచ్‌ల భారాన్ని తగ్గించేందుకు ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలతో బీసీసీఐ, ఆటగాళ్లు మాట్లాడాలని తెలిపాడు.

ఇప్పటికే రోడ్డు ప్రమాదంతో రిషభ్ పంత్ జట్టుకు దూరం కాగా.. వెన్ను గాయాలతో జస్‌ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్‌ బాధపడుతున్నారు. ఈ ఇద్దరు కూడా వన్డే ప్రపంచకప్ ఆడే సూచనలు కనిపించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లీగ్‌ల్లో ఆటగాళ్లు భాగం కావడంతో ప్లేయర్లకు తగిన విశ్రాంతి సమయం దొరకడం లేదన్నారు. ఈ విషయంపై బీసీసీఐ, ఆటగాళ్లు కూర్చొని చర్చించుకోవాలి అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. అవసరమైతే భారత ఆటగాళ్లు ఐపీఎల్‌కు దూరంగా ఉండాలి. బీసీసీఐ కూడా జోక్యం చేసుకోవాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed