- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పారాలింపిక్స్‌లో మూడో బంగారు పతకం.. మరోసారి మెరిసిన సుమిత్
దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ పారా జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్ మళ్లీ అదరగొట్టాడు. టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన అతను మరోసారి దేశానికి పసిడి పతకం అందించాడు. పారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్స్‌లో సోమవారం రాత్రి జరిగిన జావెలిన్ త్రో ఎఫ్64 కేటగిరీలో సుమిత్ బల్లెంను 70.59 మీటర్లు దూరం విసిరి గోల్డ్ మెడల్ సాధించాడు. మొదటి ప్రయత్నంలో 69.11 మీటర్లు విసిరిన అతను.. రెండో ప్రయత్నంలో పతక ప్రదర్శన చేశాడు. ఆ తర్వాత వరుసగా 66, 66 మీటర్లు, 69.04 మీటర్లు, 66.57 మీటర్లు జావెలిన్‌ను విసిరాడు. 70.59 మీటర్ల త్రోకు ఇతర అథ్లెట్లు దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. రజతం గెలిచిన శ్రీలంక అథ్లెట్ కొడితువక్కు డులాన్ 67.03 మీటర్లు విసరగా.. బ్రాంజ్ మెడలిస్ట్ బురియన్ మిచల్(ఆస్ట్రేలియా) 64.89 మీటర్ల ప్రదర్శన చేశాడు. పారాలింపిక్స్‌లో భారత్‌కు ఇది మూడో స్వర్ణం. షూటింగ్‌లో అవనీ లేఖరా, బ్యాడ్మింటన్ నితేశ్ గోల్డ్ మెడల్స్ సాధించారు.