Paris Paralympics 2024 : ఆర్చరీలో భారత్‌కు తొలి పతకం.. శీతల్-రాకేశ్ జోడీకి కాంస్యం

by Harish |
Paris Paralympics 2024 : ఆర్చరీలో భారత్‌కు తొలి పతకం.. శీతల్-రాకేశ్ జోడీకి కాంస్యం
X

దిశ, స్పోర్ట్స్ : పారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్స్‌లో సోమవారం భారత అథ్లెట్లపై పతక వర్షం కురుస్తోంది. ఈ విశ్వక్రీడల్లో ఆర్చరీలో భారత్‌కు తొలి మెడల్ దక్కింది. మిక్స్‌డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ కేటగిరీలో శీతల్ దేవి, రాకేశ్ కుమార్ జోడీ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో శీతల్-రాకేశ్ ద్వయం 156-155 తేడాతో ఇటలీకి చెందిన సర్టి ఎలినోరా-బొనాసినా మాటియో జంటను ఓడించింది. దీంతో పారాలింపిక్స్ చరిత్రలో మిక్స్‌డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ కేటగిరీలో దేశానికి తొలి మెడల్ దక్కింది. అంతేకాకుండా, ఆర్చరీలో భారత్‌కు ఇదే రెండో పతకం. టోక్యోలో హర్విందర్ సింగ్ కాంస్యం గెలిచాడు. బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌కు ముందు శీతల్-రాకేశ్ ద్వయం తృటిలో ఫైనల్‌కు చేరే అవకాశాన్ని కోల్పోయింది. ఆసక్తికరంగా సాగిన సెమీస్‌లో భారత జోడీ షూటౌట్‌లో ఇరాన్ చేతిలో ఓడింది. ఆర్చరీలో పతకంతో భారత్ పతకాల సంఖ్య 14కు చేరింది. ఇప్పటివరకు సోమవారం ఒక్కరోజే ఆరు పతకాలు దక్కాయి.

Advertisement

Next Story

Most Viewed