- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భారత పారా పిస్టల్ టీమ్‌కు స్వర్ణం
by Harish |
X
దిశ, స్పోర్ట్స్ : ఢిల్లీలో జరుగుతున్న పారా షూటింగ్ వరల్డ్ కప్‌లో భారత షూటర్ల పతక జోరు కొనసాగుతోంది. మంగళవారం మరో స్వర్ణం, రజతం భారత్ ఖాతాలో చేరాయి. పీ5 మిక్స్‌డ్ టీమ్ 10 మీటర్ల మీటర్ల ఎయిర్ పిస్టల్ స్టాండర్డ్ ఎస్‌హెచ్1 ఈవెంట్‌లో రుద్రాన్ష్ ఖండేల్వాల్, ఆకాశ్, సందీప్ కుమార్‌లతో కూడిన భారత జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్‌లో 1050 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది. ఈ టోర్నీలో భారత్‌కు ఇది రెండో బంగారు పతకం. ఇదే ఈవెంట్‌లో వ్యక్తిగత విభాగంలో రుద్రాన్ష్ ఖండేల్వాల్ సత్తాచాటాడు. 364 స్కోరుతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం సొంతం చేసుకున్నాడు. టోర్నీలో రుద్రాన్ష్‌కు ఇది నాలుగో పతకం కావడం విశేషం. అంతేకాకుండా, ఈ ప్రదర్శనతో జూనియర్ విభాగంలో కొత్త వరల్డ్ రికార్డును నెలకొల్పాడు.
Advertisement
Next Story