Asian Games: ఎయిర్ పిస్తోల్ వ్యక్తిగ‌త ఈవెంట్‌లో పాల‌క్‌కు స్వర్ణం

by Vinod kumar |
Asian Games: ఎయిర్ పిస్తోల్ వ్యక్తిగ‌త ఈవెంట్‌లో పాల‌క్‌కు స్వర్ణం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా క్రీడ‌ల్లో భార‌త షూట‌ర్లు దుమ్మురేపుతున్నారు. 10 మీట‌ర్ల ఎయిర్ పిస్తోల్ ఈవెంట్‌లో షూట‌ర్ పాల‌క్ స్వర్ణ ప‌త‌కాన్ని కైవ‌సం చేసుకున్నది. మ‌హిళ‌ల వ్యక్తిగ‌త ఈవెంట్‌లో గోల్డ్ మెడ‌ల్ కొట్టేసింది. ఇదే ఈవెంట్‌లో మ‌రో షూట‌ర్ ఇషా సింగ్‌కు సిల్వర్ మెడ‌ల్ వ‌చ్చింది. 17 ఏళ్ల పాల‌క్.. అంద‌రి అంచ‌నాల్ని త‌ల‌కిందులు చేస్తూ.. సూప‌ర్ స్కిల్స్‌ను ప్రద‌ర్శించింది. పాల‌క్‌పై ప్రశంస‌ల వ‌ర్షం కురుస్తోంది. వ్యక్తిగ‌త ఈవెంట్‌లో పాల‌క్ ముందు నుంచే దూసుకెళ్లింది. 13 షాట్స్ త‌ర్వాత ఆమె 131.4 స్కోర్‌తో లీడింగ్‌లో ఉంది. 23 షాట్స్ త‌ర్వాత పాలక్‌.. 232.6 స్కోరుతో, ఇషా సింగ్ 229.2 స్కోరుతో రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడ‌ల్‌ను కైవ‌సం చేసుకున్నది.

Advertisement

Next Story

Most Viewed