భారత షూటింగ్ కోచ్‌ పదవిపై ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ ఆసక్తి

by Harish |
భారత షూటింగ్ కోచ్‌ పదవిపై ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ ఆసక్తి
X

దిశ, స్పోర్ట్స్ : భారత షూటర్లకు కోచింగ్ ఇచ్చేందుకు ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, బ్రిటన్ లెజెండరీ డబుల్ ట్రాప్ షూటర్ పీటర్ విల్సన్ ఆసక్తి చూపిస్తున్నాడు. కోచ్ పదవి కోసం విల్సన్ నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు కూడా చేసుకున్నాడు. ఈ విషయాన్ని శనివారం విల్సనే స్వయంగా వెల్లడించాడు. ‘నా రెజ్యూమ్‌ను నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు ఈ-మెయిల్ చేశాను. వాళ్ల రిప్లై కోసం ఎదురుచూస్తున్నా. లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు సీనియర్ జట్టును సిద్ధం చేయడానికి వారితో కలిసి పనిచేయాలనుకుంటున్నా. జూనియర్లను రాబోయే 8-12 ఏళ్లకు సిద్ధం చేస్తా. నా లక్ష్యం విజయం మాత్రమే. అంతకుమించి ఏం లేదు.’ అని తెలిపాడు. కాగా, 2012లో జరిగిన లండన్ ఒలింపిక్స్‌లో డబుల్ ట్రాప్‌లో పీటర్ విల్సన్ పీటర్ విల్సన్ స్వర్ణ పతకం సాధించాడు. డబుల్ ట్రాప్‌లో వరల్డ్ రికార్డును కలిగి ఉన్నాడు. అంతేకాకుండా, పారిస్ ఒలింపిక్స్‌లో ట్రాప్ షూటింగ్‌లో గోల్డ్ మెడల్ గెలిచిన గ్రేట్ బ్రిటన్ షూటర్ నాథన్ హేల్స్‌కు విల్సనే కోచ్. మరోవైపు, భారత షూటింగ్‌లో ట్రాప్ కోచ్ లేడు. పారిస్ ఒలింపిక్స్‌లో చాలా మంది షూటర్లు తమ వ్యక్తిగత కోచ్‌ల సహాయంతో పోటీలో పాల్గొన్నారు.

Advertisement

Next Story