వినేష్ ఫోగట్‌కు నోటీసు జారీ జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ

by Mahesh |   ( Updated:2024-09-27 09:01:19.0  )
వినేష్ ఫోగట్‌కు నోటీసు జారీ జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ
X

దిశ, వెబ్ డెస్క్: 2024 పారీస్ ఒలింపిక్స్‌లో రెజ్లర్ వినేష్ ఫోగట్‌ ఫైనల్ మ్యాచ్ వరకు చేరుకొని.. తీరా ఫైనల్ మ్యాచ్ ముందు అధిక బరువు కారణంగా అనర్హత వేటు పడడంతో వట్టిచేతులతో భారత్ కు తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఆమె ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరి.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంది. ఇదిలా ఉంటే జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) మాజీ రెజ్లర్, రాజకీయ నాయకురాలు వినేష్ ఫోగట్‌కు నోటీసు జారీ చేసింది. తన వైఫల్యానికి సంబంధించి 14 రోజుల్లో వివరణ ఇవ్వాలని నాడా కోరింది. సెప్టెంబరు 9న సోనేపట్ యొక్క ఖర్ఖోడా గ్రామంలోని ఆమె ఇంట్లో డోప్ పరీక్షకు అందుబాటులో లేకపోవడం ఇందుకు కారణంగా NADA తెలియజేసింది. " ADR ఆచూకీ అవసరాలకు అనుగుణంగా ఆమె వైఫల్యం గురించి తెలియజేయడానికి మీకు ఈ అధికారిక నోటీసు ఇవ్వబడింది. మేము ఈ విషయంపై తుది నిర్ణయానికి వచ్చే ముందు మీ స్పందన కోరుతున్నాం" NADA వినేష్ ఫోగట్ కు నోటీసులో పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed