ఐవోసీ మెంబర్‌గా మళ్లీ నీతా అంబానీ ఎన్నిక

by Harish |
ఐవోసీ మెంబర్‌గా మళ్లీ నీతా అంబానీ ఎన్నిక
X

దిశ, స్పోర్ట్స్ : ఇంటర్నేషనల్‌ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) మెంబర్‌గా భారత్ నుంచి రిలయన్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ మరోసారి ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఐవోసీ బుధవారం వెల్లడించింది. పారిస్‌లో జరిగిన 142వ ఐవోసీ సెషన్‌లో ఎన్నిక నిర్వహించగా ఆమె ఏక్రగీవంగా ఎన్నికయ్యారు. ఆమెకు 100 శాతం ఓట్లు వచ్చినట్టు ఐవోసీ తెలిపింది. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో ఆమె తొలిసారిగా ఐవోసీ బాడీలో చేరారు. ఐవోసీలో భాగమైన తొలి భారత మహిళగా ఆమె నిలిచింది. మరోసారి ఎన్నికవడంపై నీతా అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. ‘ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి తిరిగి ఎన్నికైనందుకు గౌరవంగా ఉంది. నాపై నమ్మకం ఉంచిన ప్రెసిడెంట్ బాచ్, ఐవోసీలోని ఇతర సభ్యులకు ధన్యవాదాలు. ఈ ఎన్నిక వ్యక్తిగత మైలురాయి మాత్రమే కాదు. ప్రపంచ క్రీడా రంగంలో భారత్ ఎదుగుతున్న తీరుకు గుర్తింపు కూడా.’ అని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed