PARIS OLYMPICS: భారత్‌కు బిగ్ షాక్.. నిరాశ పరిచిన నిఖత్ జరీన్

by Bhoopathi Nagaiah |
PARIS OLYMPICS: భారత్‌కు బిగ్ షాక్.. నిరాశ పరిచిన నిఖత్ జరీన్
X

దిశ, వెబ్‌డెస్క్ : పారిస్ ఒలింపిక్స్ క్రీడలలో స్వర్ణ పతకం గెలుస్తుందనుకున్న బాక్సర్, రెండు సార్లు ప్రపంచ కప్ విజేత, తెలంగాణకు చందిన నిఖత్ జరీన్ నిరాశ పరిచింది. గురువారం జరిగిన మహిళల 50 కేజీల ప్రి క్వార్టర్ ఫైనల్ మ్యాచులో చైనాకు చందిన బాక్సర్ 'వు యు' చేతిలో 5-0 తేడాతో పరాజయం పొందింది. దీంతో నిఖత్ పతక ఆశలు ఆవిరయ్యాయి. వు యు ప్రస్తుత ఆసియా క్రీడల ఛాంపియన్ మరియు ప్రస్తుత ఒలింపిక్స్‌లో 50 కేజీల విభాగంలో టాప్ సీడ్ క్రీడాకారిణిగా ఉంది. ఈ సందర్భంగా నిఖత్ PTI తో మాట్లాడూతూ.. నేను ఈ ప్రత్యర్థిని ఇంతవరకు ఎదుర్కోలేదు. నాకంటే నా ప్రత్యర్థి చాలా వేగంగా ఆడింది. అందుకే నేను ఓడిపోయాను. ఇది తనకు ఒక గుణపాఠం లాంటిదని చెప్తూ సారీ చెప్పింది. ఇండియాకు వచ్చిన తరువాత తన తప్పులపై విశ్లేషించుకుంటానని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed