- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Delhi: టీమ్ ఇండియా Wc ఓటమికి ప్రధాన కారణం అదేనా..?
న్యూఢిల్లీ: ఈ సారి వన్డే ప్రపంచకప్ భారత్‌దే.. టోర్నీలో భారత్ జైత్రయాత్ర చూసిన తర్వాత అభిమానులే కాదు.. మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తీరా.. ఫైనల్‌లో రోహిత్ సేన ఓటమి. ఫైనల్‌కు ముందు ప్రత్యర్థి జట్లను బెంబేలెత్తించిన టీమ్ ఇండియా టైటిల్ పోరుకు వచ్చే సరికి దాసోహమంది. ఆస్ట్రేలియాకు కప్ సమర్పించుకుంది. ఫైనల్‌లో భారత్ ఓటమికి కారణాలు చాలానే ఉన్నాయి. టాస్ ఓడిపోవడం, టాపార్డర్ త్వరగా అవుటవడం, బౌలర్లు తేలిపోవడం, రెండో ఇన్నింగ్స్‌లో మంచు పడటం..ఈ అంశాలు భారత్ ప్రదర్శనపై ప్రభావితం చూపాయి. ముఖ్యంగా భారత ఆటగాళ్లు ఒత్తిడిని అధిగించలేకపోవడమే ఓటమికి ప్రధాన కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
టాస్.. మంచు ప్రభావం
టాస్ ఓడిపోవడంతోనే భారత్ ఓటమి ఖరారైందని చాలా మంది అనుకున్నారు. టాస్ గెలిచిన ఆసిస్ కెప్టెన్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆ పిచ్ సెకండ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని గ్రహించిన అతను చేజింగ్‌కు మొగ్గుచూపాడు. సెకండ్ బ్యాటింగ్ సమయంలో అక్కడ మంచు ప్రభావంతో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. అక్కడ ప్రపంచకప్‌లో జరిగిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట చేజింగ్ చేసిన జట్టే గెలిచింది. ఆ కారణంతోనే భారత్ టాస్ ఓడిపోవడంతోనే మ్యాచ్ కూడా గెలవడం కష్టమని ఫ్యాన్స్ భావించారు. అయితే, 300 టార్గెట్ పెట్టుంటే గెలిచే అవకాశాలు ఉండేవి. కానీ, ఆ పిచ్‌పై సగటు స్కోరు 243 మాత్రమే. అందుకు తగ్గట్టుగానే భారత్ 240 పరుగులు చేసింది. మొదట ఆసిస్ ఇన్నింగ్స్‌లోనూ బ్యాటర్లు తడబడ్డారు. 47 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయారు. ఎప్పుడు స్టేడియంలో మంచు కురవడం ప్రారంభమైందో అప్పుడు ఆసిస్ బ్యాటర్లకు ఛేదన సులభమైంది. బంతి నేరుగా బ్యాటు పైకి రావడంతో ట్రావిస్ హెడ్ చెలరేగి ఆడాడు.
బౌలర్ల వైఫల్యం
బ్యాటర్లు మ్యాచ్‌ను గెలిపిస్తే.. బౌలర్లు టోర్నమెంట్‌ను గెలిపిస్తారని అంటుంటారు. ఈ సారి భారత్ వరల్డ్ కప్ గెలుస్తుందని బలంగా నమ్మడానికి బౌలర్లు కూడా ఓ కారణం. ముఖ్యంగా షమీ ప్రత్యర్థులను బెంబేలెత్తించాడు. అలాగే, బుమ్రా కూడా అదరగొట్టాడు. జడేజా, కుల్దీప్ తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఇంగ్లాండ్‌పై 229 పరుగులే చేసి 100 పరుగుల తేడాతో విజయం సాధించడంలోనైనా.. శ్రీలంక, సౌతాఫ్రికా జట్లను 100లోపే ఆలౌట్ చేయడంలోనైనా.. సెమీస్‌లో న్యూజిలాండ్‌ను కట్టడి చేయడంలోనైనా భారత బౌలర్లు కీలక పాత్ర పోషించారు. భారత క్రికెట్ చరిత్రలోనే ఇదే అత్యుత్తమ బౌలింగ్ దళమని భారత మాజీ క్రికెటర్లు సైతం కితాబిచ్చారు. మరోవైపు, సొంత పిచ్‌లు. దాంతో ఫైనల్‌లో ఆసిస్ బ్యాటర్లను చుక్కలు ఖాయమే అని అంతా అనుకున్నారు. తీరా.. ఫైనల్‌లో బౌలర్లు అంచనాలను అందుకోలేకపోయారు. మొదట అద్భుతంగానే బౌలింగ్ చేశారు. వార్నర్, మిచెల్ మార్ష్ స్మిత్ వికెట్లను త్వరగానే తీశారు. మంచు ప్రభావం చూపించడం, హెడ్, లబుషేన్ జోడీ క్రీజులో పాతకపోవడంతో భారత బౌలర్లు పట్టు తప్పారు. బౌలర్లు పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోవడంతో ప్రత్యర్థి బ్యాటర్లను అవుట్ చేసే వ్యూహాలను రచించలేకపోయారు.
ఒత్తిడిలో ఆత్మరక్షణలో పడిన బ్యాటర్లు
ఐసీసీ ఈవెంట్లలో భారత ఆటగాళ్లు మొదట ఆశలు రేపడం ఆ తర్వాత ఊసురుమనిపించడం అలవాటే. గత పదేళ్లలో దాదాపు 10 సార్లు ఐసీసీ ఈవెంట్లలో సెమీస్ లేదా ఫైనల్‌లో ఓడిపోయారు. ఎప్పుడు వినిపించే మాటే భారత ప్లేయర్లు ఒత్తిడిని అధిమించలేకపోయారని. ఇప్పుడూ అదే మాట వినిపిస్తుంది. కానీ, ఈ సారి భారత ఆటగాళ్లు ఫైనల్‌లో ఒత్తిడిని జయిస్తారని చాలా మంది నమ్మారు. అందుకు లీగ్ దశలో భారత్ ప్రదర్శనే కారణం. పలు మ్యాచ్‌ల్లో కఠిన పరిస్థితుల్లోనూ ఎదుర్కొని నిలబడింది. సెమీస్‌లో న్యూజిలాండ్‌తో పోరులోనూ భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి జట్టును గెలిపించారు. భారత్‌తో పోలిస్తే ఆసిస్‌పైనే ఎక్కువగా ఒత్తిడి ఉంటుందని విశ్లేషకులు సైతం చెప్పారు. అయితే, ఫైనల్‌లో అందుకు భిన్నంగా జరిగింది. భారత ఆటగాళ్లు ఒత్తిడికి లోనైతో ఆసిస్ ప్లేయర్లు మాత్రం ఆత్మవిశ్వాసంతో కనిపించారు. ముందుగా ఆసిస్ బౌలింగ్, అద్భుతమైన ఫీల్డింగ్‌తో భారత్ ఆత్మరక్షణలో పడింది. కెప్టెన్ రోహిత్ క్రీజులో ఉన్నంత వరకు జట్టుకు ఢోకా లేదనిపించింది. అతను ఆ రేంజ్‌లో బౌలర్లపై విరుచుకపడ్డాడు. అయితే, తొలి ప్రపంచకప్ ఆడుతున్న గిల్, శ్రేయస్ అయ్యర్ ఒత్తిడిని అధిగమించలేక వికెట్ పారేసుకోవడంతో టాపార్డర్‌పై ప్రభావం చూపింది. రోహిత్ అవుటవడం కూడా జట్టును కోలుకోకుండా చేసింది. ఆ తర్వాత కోహ్లీ, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ నిర్మించినా.. వారు పూర్తిగా డిఫెన్స్‌కే పరిమితమయ్యారు. దాదాపు 26 ఓవర్లలో ఒక్క ఫోర్ కూడా రాలేదంటే వీరిద్దరూ ఏ విధంగా ఆత్మరక్షణలో పడ్డారో అర్థం చేసుకోవచ్చు. దీన్ని ఆసిస్ బౌలర్లు ఉపయోగించుకుని భారత్ మోస్తరు స్కోరుకే పరిమితం చేశారు.