ఐపీఎల్-2023లో నేడు కీలక పరిణామం

by GSrikanth |
ఐపీఎల్-2023లో నేడు కీలక పరిణామం
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2023 మినీ వేలానికి రంగం సిద్ధమైంది. కేరళలోని కొచ్చి వేదికగా నేడు(శుక్రవారం) వేలం జరుగనుంది. ఒకరోజు మాత్రమే జరిగే ఈ ఆక్షన్‌లో 405 మంది క్రికెటర్లు వేలంలో పాల్గొననున్నారు. గరిష్టంగా 87 స్థానాల కోసం ఆటగాళ్లు పోటీపడుతున్నారు. ప్రాంచైజీలు కీలక ప్లేయర్లను వదిలిపెట్టడం, విదేశీ స్టార్‌ క్రికెటర్లు వేలంలో ఉండటంతో మినీ వేలంపై ఆసక్తి నెలకొంది. కొచ్చిలోని బోల్‌‌గటీ ఐలాండ్‌లో ఉన్న గ్రాండ్ హయత్‌ హోటల్‌లో ఐపీఎల్-2023 వేలం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ఫ్రాంచైజీలు కొచ్చి చేరుకున్నాయి. ఈ ఏడాది మెగా వేలాన్ని నిర్వహించిన హ్యు ఎడ్మీడెస్ మినీ వేలాన్నీ నిర్వహించనున్నారు. వేలంలో పాల్గొనేందుకు మొత్తం 991 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకోగా.. బీసీసీఐ 405 మంది ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్‌ చేసింది. ఇందులో 273 మంది భారత ఆటగాళ్లు ఉండగా.. 132 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed