- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పారిస్ ఒలింపిక్స్‌లో ముగిసిన భారత ప్రస్థానం
దిశ, వెబ్ డెస్క్: 2024 పారిస్ ఒలింపిక్స్ లో భారత ప్రస్థానం శనివారంతో ముగిసింది. ఈ సీజన్ లో ఒక్క బంగారు పతకం సాధించకుండా భారత్ నిరాశతోనే ఒలిపింక్స్‌ను మగించింది. టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలను సాధించగా ఈ సారి కేవలం 6 పతకాలతోనే భారత్ సరిపెట్టుకుంది. ఈ సీజన్ లో భారత్ మొత్తం 16 క్రీడల్లో 117 మంది ప్లేయర్లు పాల్గొన్నారు. ఇందులో షూటింగ్ లోనే భారత్ కు 3 కాంస్య పతకాలు వచ్చాయి. అలాగే రెజ్లింగ్ లో 1, హాకీలో 1, జావెలిన్ త్రో లో ఒక పతకం వచ్చింది. ఇందులో ఉమెన్స్ షూటింగ్ విభాగంలో మనుబాకర్ 2 పతకాలు సాధించి రికార్డు సృష్టించారు. మొత్తం ఆరు పతకాలతో భారత్ ఒలింపిక్స్ పతకాల పట్టికలో 71వ స్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే ఒలింపిక్స్ లో కేవలం ఒకే ఒక్క పతకం సాధించిన పాకిస్తాన్ 62వ స్థానంలో ఉంది. ఈ ఒలింపిక్స్ లో 39 బంగారు పతకాలతో చైన మొదటి స్థానంలో ఉండగా.. 38 బంగారు పతకాలతో సహా సిల్వర్ 42, బ్రాంజ్ 42 పతకాలు కలిపి మొత్తం 122 పతకాలతో అమెరికా రెండో స్థానంలో ఉంది. అలాగే అత్యధిక పతకాలు సాధించిన దేశంగా అమెరికా మొదటి స్థానంలో ఉంది. అలాగే 18 గోల్డ్ మెడల్స్‌తో ఆస్ట్రేలియా జట్టు మూడో స్థానంలో నిలిచింది.