భారత్‌తో మ్యాచ్ అంటే మాకూ టెన్షనే : బాబర్ ఆజామ్

by Harish |
భారత్‌తో మ్యాచ్ అంటే మాకూ టెన్షనే : బాబర్ ఆజామ్
X

దిశ, స్పోర్ట్స్ : భారత్, పాక్ మ్యాచ్‌పై భారీ అంచనాలు ఉంటాయని, సహజంగానే ఆ మ్యాచ్ అంటే తమకూ టెన్షన్‌గా ఉంటుందని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తెలిపాడు. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఈ నెల 9న భారత్, పాక్ మ్యాచ్ జరగనుంది. తాజాగా ఈ మ్యాచ్‌పై బాబర్ ఆజామ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) పాడ్‌కాస్ట్‌లో అతను మాట్లాడుతూ.. మరే మ్యాచ్‌కు లేనంతగా భారత్, పాక్ మ్యాచ్‌పై చర్చ జరుగుతుందన్నాడు. ‘ప్రపంచంలోకి ఎక్కడికి వెళ్లిన భారత్, పాక్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటారు. అభిమానులు ఈ మ్యాచ్‌పైనే ఫోకస్ పెడతారు. ఆ అంచనాలు సహజంగానే మమ్మల్ని టెన్షన్ పెడతాయి. తీవ్ర ఒత్తిడితో కూడుకున్న మ్యాచ్ ఇది. ఒత్తిడిని ఎలా అధిగమిస్తారనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ప్రశాంతంగా ఉండటంతోపాటు కష్టపడాలి. దానికితోడు మన సామర్థ్యాలపై నమ్మకంగా ఉంటే సులభమవుతుంది.’ అని తెలిపాడు. కాగా, గతేడాది వన్డే వరల్డ్ కప్‌లో ఇరు జట్లు చివరిసారిగా ఎదురుపడ్డాయి. ఆ మ్యాచ్‌లో టీమ్ ఇండియా 7 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది.

Advertisement

Next Story

Most Viewed