YS Jagan:‘దీపావళి కానుక ఇదేనా చంద్రబాబు?’.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
YS Jagan:‘దీపావళి కానుక ఇదేనా చంద్రబాబు?’.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో టీడీపీ(TDP), వైసీపీ(YCP) నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) పై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్(YS Jagan) సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పక్కనపెట్టి వైసీపీ(YSRCP) పై విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. ఈ క్రమంలో రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచాలన్న ప్రతిపాదనపై వైఎస్ జగన్ సెటైర్లు వేశారు. ప్రజలకు ఇస్తున్న దీపావళి కానుక కరెంట్ చార్జీలు పెంచడమేనా చంద్రబాబు? అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి ఉంటే విద్యుత్ ఛార్జీలు(Electricity charges) తగ్గించేవారిమని చెప్పి, ఇప్పుడు భారీ స్థాయిలో పెంచి మాట తప్పడమే చంద్రబాబు(CM Chandrababu) నైజమని రుజువు చేశారని విమర్శించారు. ఈ విషయమై వైసీపీపై నిందలు వేయడం ఎంత వరకు సమంజసమని వైసీపీ చీఫ్ జగన్ మండిపడ్డారు.

Advertisement

Next Story