- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అత్యుత్తమ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రోహిత్..
న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ టైటిల్ వేటలో జైత్రయాత్ర కొనసాగించిన టీమ్ ఇండియా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. భారత్‌ను ఓడించి ఆస్ట్రేలియా 6వ సారి విశ్వవిజేతగా అవతరించిన విషయం తెలిసిందే. ప్రపంచకప్ ముగిసిన నేపథ్యంలో ఐసీసీ సోమవారం ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’ను ప్రకటించింది. ఈ జట్టుకు భారత కెప్టెన్ రోహిత్ శర్మను సారథిగా ఎంపిక చేసింది. అంతేకాకుండా, రోహిత్‌సహా ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు దక్కడం విశేషం.
కోహ్లీ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీలకు స్థానం కల్పించింది. రోహిత్, క్వింటన్ డికాక్(సౌతాఫ్రికా)లను ఓపెనర్లుగా ఎంపిక చేసింది. విరాట్ కోహ్లీ, డారిల్ మిచెల్(న్యూజిలాండ్), కేఎల్ రాహుల్‌లను 3, 4, 5 స్థానాలకు తీసుకోగా.. ఆల్‌రౌండర్లుగా జడేజా, మ్యాక్స్‌వెల్(ఆస్ట్రేలియా)కు చోటు కల్పించింది.
ఇక, బౌలింగ్ దళంలో బుమ్రా, షమీ, దిల్షాన్ మధుశంక(శ్రీలంక), గెరాల్డ్ కోయెట్జీ(సౌతాఫ్రికా)లతోపాటు ఏకైక స్పిన్నర్‌గా ఆడమ్ జంపా(ఆస్ట్రేలియా)లను ఎంపిక చేసింది. కాగా, ఐసీసీ జట్టులో ఆరుగురు భారత క్రికెటర్లకు చోటు దక్కిందంటే టోర్నీలో టీమ్ ఇండియా ఎంత అద్భుతంగా రాణించిందో అర్థం చేసుకోవచ్చు. చాంపియన్ జట్టు ఆస్ట్రేలియా నుంచి కేవలం ఇద్దరికి మాత్రమే దక్కడం గమనార్హం.