ఆ సాంగ్ వింటే గూస్‌బంప్స్- నీరజ్ చోప్రా

by Shamantha N |
ఆ సాంగ్ వింటే గూస్‌బంప్స్-  నీరజ్ చోప్రా
X

దిశ, స్పోర్ట్స్ : శివ్‌తాండవ్ సాంగ్ వింటే తనకు గూస్ బంప్స్ వస్తాయని టోక్యో ఒలింపిక్స్, భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తెలిపాడు. తాజాగా జియో సినిమాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఇప్పటికీ తాను తన అత్యుత్తమ ప్రదర్శన చేయలేదన్నాడు. ‘ఇప్పుటికీ 2016లో జరిగిన వరల్డ్ అండర్ 20 చాంపియన్‌షిప్ 2లో 86.48 మీటర్ల ప్రదర్శనతో సంతపృప్తిగా ఉన్నా. అప్పటి నుంచి ఇప్పటివరకు నా ప్రదర్శనతో సంతృప్తిగా లేను. చాలా పోటీలు, గోల్డ్ మెడల్స్ సాధించాను. కానీ, ఇంకా నా అత్యుత్తమ ప్రదర్శన చేయలేదు.’ అని తెలిపాడు. అలాగే, తాను హై ఎనర్జీ మ్యూజిక్ వినడానికి ఇష్టపడతానని చెప్పాడు. ‘నాకు ఫేవరెట్ ప్లే లిస్ట్ లేదు. కానీ, ఎక్కువగా లౌడ్ మ్యూజిక్ వింటాను. ఆసియా క్రీడల్లో శివ్ తాండవ్ వింటుంటే గూస్ బంప్స్ వచ్చాయి. నేను సాధారణంగానే ఉంటాను. కానీ, కాంపిటేషిన్‌లో మాత్రం అగ్రెసివ్‌గా ఉంటా.’ అని చెప్పుకొచ్చాడు. కాగా, ఇటీవల గాయం కారణంగా చెక్ రిపబ్లిక్‌లో జరిగిన అథ్లెటిక్స్ మీట్ నుంచి తప్పుకున్న నీరజ్ పారిస్ ఒలింపిక్స్ నాటికి సన్నద్ధమయ్యేందుకు కష్డపడుతున్నాడు.

Advertisement

Next Story

Most Viewed