Sunil Chhetri: నన్ను చంపినా పట్టించుకోను... సునీల్ ఛెత్రీ సంచలన వ్యాఖ్యలు

by Bhoopathi Nagaiah |
Sunil Chhetri: నన్ను చంపినా పట్టించుకోను... సునీల్ ఛెత్రీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్ : భారత దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాళ్లలో ఒకరైన సునీల్ ఛెత్రీ, భారత్ ఒలింపిక్స్ క్రీడలలో ఎక్కువ పతకాలు సాధించకపోవడానికి గల కారణాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారతదేశంలో 1.5 బిలియన్ల జనాభా ఉన్నప్పటికీ భారత్‌కు ఎక్కువ పతకాలు రాకపోవడానికి గల కారణాన్ని ఛెత్రీ 'X' లో వివరించాడు. ఛెత్రీ మాట్లాడుతూ... "మన దేశ జనాభా దాదాపు 150 కోట్ల వరకు ఉన్న కూడా ఒలింపిక్స్ క్రీడలలో ఎక్కువ పతకాలు సాధించలేకపోతున్నాం. మనకంటే తక్కువ జనాభా ఉన్న ఆస్ట్రేలియా, జపాన్, జర్మనీ, కెనడా వంటి దేశాలు ఈ క్రీడలలో ఎక్కువ పతకాలు సాధిస్తూ, మనకంటే ఎన్నో మైళ్ల దూరం ముందున్నాయని అన్నాడు. మన దేశంలో టాలెంట్ విషయంలో కొరతలేదని, కానీ.. ప్రోత్సాహం లేకపోవడంతో చాలా మంది ఏదో ఒక జాబ్ వెతుక్కొని క్రీడల నుంచి దూరం వెళ్లిపోతున్నారని అన్నాడు. ప్రోత్సాహకం విషయంలో మనం చాలా వెనుకబడిపోయాం. ఇలా అంటున్నందుకు నన్ను ఏమైనా చేసిన భయపడనని" ఛెత్రీ వ్యాఖ్యానించాడు. ఈ క్రమంలో ఛెత్రీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed