- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
క్రికెట్ ప్రియులకు భారీ గుడ్ న్యూస్.. టీ-20 వరల్డ్ కప్ వేళ Hot Star బంపర్ ఆఫర్..!
దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న టీ-20 వరల్డ్ కప్ జూన్ 2వ తేదీన నుండి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అమెరికా, వెస్టిండిస్ సంయుక్తంగా అతిథ్యమిస్తోన్న ఈ పొట్టి ప్రపంచ కప్ కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో క్రికెట్ ప్రియులకు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. టీ-20 వరల్డ్ కప్ మ్యాచ్‌లను తమ ప్లాట్ ఫామ్‌లో ఉచితంగా ప్రసారం చేస్తామని ప్రకటించింది. ఎలాంటి సబ్‌స్ర్కిప్షన్ లేకున్నా ఉచితంగా మ్యాచులు చూడొచ్చని అనౌన్స్ చేసింది.
దీనిపై ఇది వరకే ప్రకటన చేసిన హాట్ స్టార్.. ఇవాళ తాజాగా మరోసారి అప్డేట్ ఇచ్చింది. ఈ మేరకు హాట్ స్టార్ ఇవాళ ఓ ఫొటో విడుదల చేసింది. బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో ఉన్న ఈ ఫొటోలో.. మొబైల్ ఫోన్‌లో ప్రతి మ్యాచ్, ప్రతి బాల్ ఫ్రీగా చూడండని పేర్కొంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నిర్ణయంపై క్రికెట్ ప్రియులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే, ఆఫర్ ఓన్లీ మొబైల్ ఫోన్లలో మ్యాచ్ చూసే వారికే వర్తిస్తుంది. టీవీ, డెస్క్ టాప్‌లలో చూసేవారికి మాత్రం ఈ అవకాశం లేదు.