16 ఏళ్ల జాతీయ రికార్డును బ్రేక్ చేసిన గుల్వీర్ సింగ్

by Harish |
16 ఏళ్ల జాతీయ రికార్డును బ్రేక్ చేసిన గుల్వీర్ సింగ్
X

దిశ, స్పోర్ట్స్ : భారత రన్నర్ గుల్వీర్ సింగ్ 16 ఏళ్ల జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు. అమెరికాలో జరిగిన ది టెన్ అథ్లెటిక్స్ మీట్‌లో పురుషుల 10 వేల మీటర్ల రేసులో గుల్వీర్ సింగ్ 27:41.81 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. ఈ ప్రదర్శనతో గుల్వీర్ సింగ్ 16 ఏళ్ల క్రితం 2008లో సురేంద్ర సింగ్(28:02.89 సెకన్లు) నెలకొల్పిన నేషనల్ రికార్డును అధిగమించి కొత్త జాతీయ రికార్డును నెలకొల్పాడు. ప్రస్తుతం గుల్వీర్ సింగ్‌కు సురేంద్ర సింగ్ కోచ్‌గా ఉండటం గమనార్హం. అలాగే, 10 వేల మీటర్ల రేసును 28 లోపు ముగించిన ఏకైక భారత అథ్లెట్‌గా గుల్వీర్ సింగ్ నిలిచాడు. అయితే, అతను పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫికేషన్ మార్క్‌(27 నిమిషాల్లోపు)ను అందుకోలేకపోయాడు. ఇదే ఈవెంట్‌లో మరో భారత అథ్లెట్ కార్తిక్ కుమార్ వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన 28:01.90 సెకన్లలో లక్ష్యాన్ని ముగించి 7వ స్థానంలో నిలిచాడు. గతేడాది ఆసియా క్రీడల్లో కార్తిక్ రజతం, గుల్వీర్ సింగ్ కాంస్యం సాధించారు. మరోవైపు, మహిళల 10 వేల మీటర్ల రేసులో సీమ 32:07.67 సెకన్ల ప్రదర్శనతో మూడో స్థానంలో నిలువగా.. సంజీవని జాదవ్(32:21.76 సెకన్లు) 4వ స్థానంతో సరిపెట్టింది.

Advertisement

Next Story

Most Viewed