- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వరల్డ్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో నిరాశ.. ప్రీ క్వార్టర్స్‌లో పోరాడి ఓడిన ఘోషల్
చికాగో: భారత అత్యుత్తమ స్క్వాష్ ప్లేయర్ సౌరవ్ ఘోషల్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పోరాడి ఓడాడు. ఆదివారం రాత్రి ఇక్కడ జరిగిన ఈ సుదీర్ఘ పోరాటంలో ఘోషల్ 11-9, 11-4, 6-11, 3-11, 10-12తో వరల్డ్ నంబర్ వన్ డీగో ఎలియాస్ చేతిలో పరాజయం పాలయ్యాడు. నాలుగేళ్ల క్రితం ఈ మెగా ఈవెంట్‌లో ఘోషల్ క్వార్టర్ ఫైనల్‌కు ఆడాడు. అయితే ఈసారి ఓడిపోయే ముందు ఘోషల్‌కు ఒకట్రెండుసార్లు మ్యాచ్ బాల్ అవకాశాలు వచ్చాయి. కానీ వాటిని అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆరంభంలోనే 2-0 ఆధిక్యంతో నిలిచిన ఘోషల్ తర్వాత రెండు గేమ్‌లను ఓడిపోవడంతో నిర్ణయాత్మక ఐదో గేమ్ ఆడాల్సి వచ్చింది.
చివరి గేమ్‌లోనూ 10-10తో సమానంగా నిలిచాడు. అయితే ఈ 36 ఏళ్ళ ఆటగాడు కీలకమైన సమయాల్లో పాయింట్లను రాబట్టలేకపోయాడు. భారత ఆటగాడు చేసిన అనవసరమైన తప్పిదాల వల్ల పెరూవియన్ ప్లేయర్ మ్యాచ్‌ను గెలిచాడు. ఘెషల్ కంటే ఎలియాస్ పదేళ్లు చిన్నవాడు. మ్యాచ్ అనంతరం ఘోషల్ పోరాటపటిమను ఎలియాస్ ప్రశంసించాడు. ఘోషల్ 2005లో తొలిసారి వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఆడాడు. గత రెండు దశాబ్దాలుగా భారతీయ స్క్వాష్‌కు టార్చ్ బేరర్‌గా ఉన్నాడు.