భారత హెడ్ కోచ్‌గా గంభీర్?.. స్పందించిన గౌతీ

by Harish |
భారత హెడ్ కోచ్‌గా గంభీర్?.. స్పందించిన గౌతీ
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 వరల్డ్ కప్‌తో ముగియనుంది. ద్రవిడ్ తర్వాత ఆ బాధ్యతలు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ చేపట్టనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ పదవిపై గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమ్ ఇండియాకు కోచ్‌గా ఉండాలని ఉందని, అంతకంటే గౌరవం మరోటి ఉండదని వ్యాఖ్యానించాడు. తాజాగా అబుదాబిలో జరిగిన ఓ కార్యక్రమంలో గంభీర్ పాల్గొన్నాడు. భారత జట్టుకు కోచ్‌గా ఉండాలనుకుంటున్నారా? అని ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు అతను పై విధంగా స్పందించాడు.

‘భారత జట్టుకు కోచ్‌గా ఉండానుకుంటున్నా. జాతీయ జట్టుకు కోచింగ్ ఇవ్వడం కంటే పెద్ద గౌరవం మరోటి ఉండదు. 140 కోట్ల భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తారు. భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం కంటే పెద్దది ఏం ఉంటుంది. నేను మాత్రమే కాదు 140 కోట్ల మంది భారతీయులు టీమ్ ఇండియా వరల్డ్ కప్ గెలవడానికి సహాయపడతారు. భారత్ ప్రపంచకప్ గెలుస్తుంది. భయం లేకుండా ఆడటమే ముఖ్యమైన విషయం.’ అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. కాగా, హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించగా.. గత నెల 27తో తుది గడువు ముగిసింది. గంభీర్ అప్లై చేసుకున్నాడా?లేదా? అన్నది తెలియదు. అయితే, గంభీరే తదుపరి హెడ్ కోచ్ అని, త్వరలోనే ప్రకటన రానుందని వార్తలు వస్తున్నాయి.

Advertisement

Next Story