Viral : క్రీడాకారులు చూయింగమ్ నమలడానికి ఎందుకని ఎక్కువగా ఇష్టపడతారు?

by Javid Pasha |
Viral : క్రీడాకారులు చూయింగమ్ నమలడానికి ఎందుకని ఎక్కువగా ఇష్టపడతారు?
X

దిశ, ఫీచర్స్ : క్రికెట్, ఫుట్‌ బాల్, వాలీబాల్.. గేమ్స్ ఏవైనా వాటిని ఆడుతున్నప్పుడు పలువురు క్రీడాకారులు చూయింగమ్ (Chewing gum) నములుతుండటం మీరెప్పుడైనా గమనించారా? అయితే దీనివెనుక ప్రత్యేక కారణం ఉందంటున్నారు ఎక్స్‌పర్ట్స్. ఏంటంటే.. చూయింగమ్ నమలడం మెదడు పనితీరుపై సానుకూల ప్రభావం చూపుతుందని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. ఏదైనా నమిలినప్పుడు నోటిలోని గ్రాహకాలు సహజంగానే రుచిని గ్రహిస్తాయి. దీంతోపాటు దవడ కదలికల కారణంగా సదరు వ్యక్తులు ఒత్తిడిని (stress) అనుభవించినప్పుడు సంబంధిత సమాచారాన్ని గ్రాహకాలు వెంటనే మెదడుకు( brain) చేరవేయడం ప్రారంభిస్తాయి. ఈ సంకేతాలను బ్రెయిన్ డీకోడ్ చేస్తుంది. కాబట్టి ఆ సందర్భంలో చూయింగమ్ నమిలిన వ్యక్తిలో చురుకుదనం, ఏకాగ్రత పెరుగుతాయని చెప్తారు.

చూయింగమ్ నమిలే ప్రాసెస్‌లో సాధారణ సమయంకంటే మెదడుకు ఎక్కువ మొత్తంలో బ్లడ్ సర్క్యుట్ అవసరం అవుతుంది. అప్పుడు హార్ట్ కూడా ఈ విషయాన్ని గ్రహించి మెదడుకు సానుకూల సంకేతాలు పంపుతుంది. అలాగే మరింత రక్తం సరఫరా చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఈ సందర్భంగా గుండె వేగంగా కొట్టుకోవడంవల్ల కండరాలకు రక్త సరఫరా మరింత మెరుగుపడుతుంది. చూయింగమ్ తింటున్న వ్యక్తిలో మెదడుకు విశ్రాంతినిచ్చే సెరోటోనిన్ కూడా విడుదలవుతుంది. కాబట్టి గ్రౌండ్‌లో ఉన్నప్పుడు అలసటను ఎదుర్కోగలుగుతారు. ఇలాంటి కారణాలవల్లే క్రీడాకారులు (athletes) గేమ్స్ ఆడుతున్నప్పుడు చూయింగమ్ నమలడానికి ఇష్టపడతారని నిపుణులు పేర్కొంటున్నారు.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్‌ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed