రోహిత్, కోహ్లీకి షాక్.. కీలక నిర్ణయం తీసుకున్న గంభీర్

by Harish |
రోహిత్, కోహ్లీకి షాక్.. కీలక నిర్ణయం తీసుకున్న గంభీర్
X

దిశ, స్పోర్ట్స్ : న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో పేలవ ప్రదర్శనతో టీమిండియా విమర్శలు ఎదుర్కొంటుంది. వరుసగా రెండు టెస్టుల్లో ఓడి ఇప్పటికే సిరీస్ కోల్పోయిన రోహిత్ సేన మూడో టెస్టులోనైనా నెగ్గి పరువు కాపాడుకోవాలనుకుంటున్నది. అలాటెగే, వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి కూడా సిద్ధం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

సీనియర్ ఆటగాళ్లకు ఇచ్చే ఆప్షనల్ ట్రైనింగ్ సెషన్‌ను రద్దు చేసినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏదైనా సిరీస్‌‌కు ముందుగానీ, మ్యాచ్‌కు ముందుగానీ ట్రైనింగ్ సెషన్లు నిర్వహిస్తారు. సాధారణంగా రోహిత్, కోహ్లీ, బుమ్రాతోపాటు పలువురు సీనియర్ ప్లేయర్లకు ట్రైనింగ్ సెషన్‌ నుంచి మినహాయింపు ఇస్తుంటారు. గాయాలపాలవుతారని లేదా వ్యక్తిగత పనుల నిమిత్తం వారికి రెస్ట్ ఇచ్చేవాళ్లు. ఇకపై సీనియర్లకు ఆ అవకాశం లేదు. ప్రతి ఒక్కరూ సాధనకు హాజరు కావాల్సిందేనని ఆటగాళ్లు గంభీర్ స్పష్టం చేసినట్టు తెలిసింది. అయితే, ఇది మూడో టెస్టుకు మాత్రమేనా లేదంటే పూర్తిగా రద్దు చేశారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. కివీస్‌తో మూడో టెస్టు వాంఖడే వేదికగా వచ్చే నెల 1 నుంచి ప్రారంభంకానుంది.

Advertisement

Next Story