Mohan Babu: నేడు మోహన్ బాబు పుట్టినరోజు.. సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టిన మంచు మనోజ్

by Anjali |   ( Updated:2025-03-19 15:20:08.0  )
Mohan Babu: నేడు మోహన్ బాబు పుట్టినరోజు.. సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టిన మంచు మనోజ్
X

దిశ, వెబ్‌డెస్క్: కొద్ది రోజుల క్రితం మంచు ఫ్యామిలీలోని గొడవలు అభిమానుల్ని కలవరపెట్టాయి. సరైన కారణం తెలియనప్పటికీ మంచు ఫ్యామిలీలో జరిగిన వివాదం సోషల్ మీడియాలో దుమారం రేపిందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో మోహన్ బాబు(Mohan Babu) ఓ జర్నలిస్టును మైక్‌తో తలపై కొట్టిన ఘటన కూడా చోటుచేసుకుంది. అతడి తలకు గాయమవ్వగా యశోద హాస్పిటల్‌(Yashoda Hospital)లో చికిత్స తీసుకున్నాడు.

అంతా కూల్ అయ్యాక మోహన్ బాబు రంజిత్ (Journalist Ranjith) అనే జర్నలిస్టు వద్దకు వెళ్లి పరామర్శించాడు. రంజిత్‌కు కాకుండా అతడి భార్య, పిల్లల్ని కూడా క్షమాపణలు కోరాడు. ఉద్దేశపూర్వకంగా కొట్టలేదని అన్నారు. తన వల్ల జరిగిన తప్పుకు క్షమించండి అని వేడుకున్నాడు. అలాగే రంజిత్ తొందరగా గాయం నుంచి కోలుకోవాలని షిరిడీ సాయి నాథుడ్ని మొక్కుతాననని తెలిపారు. స్పందించిన రంజిత్.. కేవలం నాకు కాదు.. జర్నలిస్టు‌ సమాజానికి చెప్పాలని అడిగారు. దీనికి బదులిస్తూ హీరో మోహన్ బాబు జర్నలిస్టులందరికీ క్షమాపణలు చెప్పారు.

మంచు కుటుంబంలో ఆస్తి పంపకాల విషయంలో గొడవలు ఉన్నాయని సోషల్ మీడయా టాక్. దీనివల్ల అన్నదమ్ములు మనోజ్(Manoj), విష్ణు (Vishnu) మధ్య విభేదాలు మరింత పెరిగాయని జనాలు చర్చించుకున్నారు. మంచు విష్ణు ఈ గొడవలపై స్పందించి.. అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమని, త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని మీడియా ముందు ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. అయితే నేడు మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికన సెలబ్రిటీలు, అభిమానులు బర్త్ డే విషెష్ తెలుపుతున్నారు.

ఈ క్రమంలో కొడుకు మంచు మనోజ్ తండ్రికి పుట్టిన రోజులు శుభాకాంక్షలు చెప్పడం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ‘‘పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా. ఈ వేడుకలో నీ పక్కన ఉండలేకపోయాను. చాలా మిస్ అవుతున్నాం. నీ పక్కన ఉండటానికి వేచి ఉండలేకపోతున్నాను నాన్నా. లవ్ యూ’’ అంటూ మనోజ్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ ద్వారా తండ్రికి విష్ చేశారు. అలాగే ‘నా సూర్యూడివి నా చంద్రుడివి’ అనే నాన్న సాంగ్ జోడించి ఓ వీడియో కూడా పంచుకున్నాడు.

Read More..

శవాలను టచ్ చేస్తూ ఎలా చనిపోయారో చెప్పేస్తున్న వ్యక్తి..

Next Story

Most Viewed