Kunamneni Sambashivarao : ప్రజల ఆశలు నెరవేర్చేలా బడ్జెట్ లేదు : కూనంనేని సాంబశివరావు

by M.Rajitha |
Kunamneni Sambashivarao : ప్రజల ఆశలు నెరవేర్చేలా బడ్జెట్ లేదు : కూనంనేని సాంబశివరావు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)లో నేడు డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka)రాష్ట్ర బడ్జెట్(State Budget) ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ పై కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(MLA Kunamneni Sambashivarao) వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ ప్రసంగం అనంతరం అసెంబ్లీ సమావేశాలు రేపేటికి వాయిదా పడ్డాయి. అనంతరం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆశలు నెరవేర్చే విధంగా బడ్జెట్ లేదని విమర్శించారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పొటాపోటీగా హామీలు ఇచ్చారని, ప్రస్తుతం వాటిని నెరవేర్చలేకపోతున్నారని ఆరోపించారు. గతేడాది బడ్జెట్ కంటే కేవలం రూ.9 వేల కోట్లు మాత్రమే పెంచారని.. వీటితో ప్రజలకు ఏం మేలు చేస్తారని మండిపడ్డారు. రూ.23 వేల కోట్లతో కేటాయింపులతో 12 నీటిపారుదల ప్రాజెక్టులు ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. లెక్కలేనన్ని పథకాలు ప్రకటించి వాటికి నిధులు కేటాయించడం మర్చిపోయారని అన్నారు. ఈ ఏడాది బడ్జెట్ లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్స్ కు కేటాయింపులు ఒక్కటే ప్రయోజకరంగా ఉందన్నారు. మొత్తంగా ఈ ఏడాది తెలంగాణ బడ్జెట్ ఉగాది పచ్చడిలా మిశ్రమంగా ఉందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.

Next Story

Most Viewed