- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Coconut Wine: కొబ్బరితో వైన్.. భలే టేస్టీ.. ఇండియాలోనే ఫస్ట్ టైం

దిశ, వెబ్‌డెస్క్: Kerala Farmer: కొబ్బరి నీరు సహజ పానీయం. దీనిని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. మిమ్మల్ని హైడ్రేటెడ్ గా ఉండమే కాదు శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇక కొబ్బరి నీళ్లను జ్యూసులు, షేక్‌లు, ఐస్ క్రీం తయారు చేసేందుకు ఉపయోగిస్తుంటారు. కానీ కొబ్బరి నీళ్ల వైన్ గురించి ఎప్పుడైనా విన్నారా? అవును మీరు చదివింది నిజమే. కొబ్బరి నీళ్లతో వైన్ తయారు చేశారు. అయితే మొదటిసారిగా చైనాలో తయారు చేశారు. కానీ భారతదేశంలో కొబ్బరి నీళ్లతో వైన్ తయారు చేసిన మొదటి వ్యక్తిగా సెబాస్టియన్ గుర్తింపు పొందాడు. సెబాస్టియన్ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. తనకు 15ఎకరాల కొబ్బరి తోట ఉంది. ఈ తోటలోనే కొబ్బరి వైన్ తయారు చేశాడు. అసలేంటీ ఈ కొబ్బరి వైన్.. దీన్ని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం.
కేరళలోని కాసర్గోడ్ జిల్లాలోని భీమనడికి చెందిన 82 ఏళ్ల సెబాస్టియన్ పి. అగస్టీన్ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. కాసర్గోడ్ లోని భీమనాడిలో తన పూర్వీకుల నుంచి వచ్చిన 15ఎకరాల భూమి ఉంది. రిటైర్మెంట్ అయిన తర్వాత సెబాస్టియన్ వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ 15 ఎకరాల భూమిలో రబ్బరు, కోకో, కొబ్బరి, డ్రాగన్ ఫ్రూట్, అవకాడో వంటి అన్యదేశ పండ్ల మొక్కలను నాటారు. 2000వ సంవత్సరంలో కొబ్బరికాయలు పురుగు బారిన పడ్డాయి. వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదిస్తే లేత కొబ్బరి కాయలను కోయమని సలహా ఇచ్చారు. అప్పుడే సెబాస్టియన్‌కు ఒక ఆలోచన వచ్చింది. భారీ మొత్తంలో లేత కొబ్బరికాయలు ఉండటంతో వైన్ తయారు చేయాలని డిసైడ్ అయ్యాడు.
2004లో మొదటిసారిగా ఇంట్లో కరిక్కు వైన్ తయారు చేశారు. అయితే తను ఫుడ్ ప్రాసెసింగ్ కోర్సు చేస్తున్న సమయంలో పనసపండు నుంచి వైన్ ఎలా తయారు చేయాలో నేర్చుకున్నారు. అదే ప్రక్రియ లేత కొబ్బరికాయలతో వైన్ తయారు చేయడంలో ఉపయోగించారు. తన రివర్ ఐలాండ్ వైనరీ ఫామ్ లో డ్రాగన్ ఫ్రూట్, మామిడి, అరటి, బొప్పాయి, జాక్ ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్ కూడా పండిస్తున్నారు. లేత కొబ్బరితో పాటు వైన్‌లో ఈ పండ్లను కూడా 25శాతం కలుపుతారు. వైన్ మరింత రుచిగా ఉండేందుకు వీటిని కలుపుతామని సెబాస్టియన్ తెలిపారు. అయితే 250 లీటర్ల వైన్ తయారు చేయడానికి 1000కొబ్బరికాయలు అవసరమని చెబుతున్నారు. ఈ వైన్ లో 12.5 నుంచి 15శాతం వరకు ఆల్కహాల్ ఉంటుందట.
ఈ ప్రక్రియ పూర్తవ్వడానికి దాదాపు 10 నుంచి 28 రోజులు సమయం పడుతుందట. ద్రాక్ష వైన్ తయారీ కంటే ఈ వైన్ తొందరగా పూర్తవుతుందని చెబుతున్నారు. చైనాలో కొబ్బరి నీళ్లతో వైన్ తయారు చేసినప్పటికీ, భారతదేశంలో కొబ్బరి నీళ్లతో వైన్ తయారు చేసిన మొదటి వ్యక్తిగా సెబాస్టియన్ గుర్తింపు పొందాడు. దీంతో అతను 2007లో పేటెంట్ పొందాడు. కేరళలో వ్యవసాయ రంగానికి చేసిన కృషికి సెబాస్టియన్‌కు కేరా కేసరి అవార్డు లభించింది.కొబ్బరి నీటి వైన్‌ను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేసి విక్రయించడానికి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నుండి లైసెన్స్ కూడా పొందారు. విదేశాలలో కూడా పేటెంట్ల కోసం దరఖాస్తులు దాఖలు అయ్యాయని సెబాస్టియన్ పి. అగస్టిన్ తెలిపారు.
Read More..
Summer tour: సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఈ ప్రాంతాలకు వెళ్లండి!