- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అలా చేశారంటే కఠిన చర్యలు తప్పవు... సీఐ వెంకటేశ్వర్లు..
by Sumithra |

X
దిశ, చందుర్తి : గంజాయి కేసులలో పట్టుబడిన వారికి స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ సర్కిల్ పరిధిలో గతంలో గంజాయి కేసులలో ఉన్న పాత నెరస్థుల పై పోలీసుల నిఘా ఎప్పుడూ ఉంటుందని, వారు తమ తమ నేర ప్రవృతిని మార్చుకొని సత్ప్రవర్తనతో మెదలాలని లేనియెడల హిస్టరీ షీట్స్, పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు.
జిల్లా ఎస్పీ నేతృత్వంలో గంజాయి నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, గంజాయి అరికట్టేందుకు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని, గంజాయి పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన కిట్లు అందుబాటులో ఉన్నాయని, డ్రంక్ & డ్రైవ్ తరహాలో గంజాయి కిట్లతో తనిఖీలు చేస్తున్నామని, గంజాయి పాజిటివ్ వచ్చిన వారి నుంచి సరఫరా దారులను పట్టుకుంటున్నామని తెలిపారు. ఈ కౌన్సిలింగ్ లో స్థానిక ఎస్సై అంజయ్య, అశోక్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
Next Story