వారి సమస్యల పరిష్కారానికే పోలీస్ దర్బార్.. పోలీస్ కమిషనర్

by Sumithra |
వారి సమస్యల పరిష్కారానికే పోలీస్ దర్బార్.. పోలీస్ కమిషనర్
X

దిశ, గోదావరిఖని : సిబ్బంది సమస్యల పరిష్కారానికే పోలీస్ దర్బార్ నిర్వహిస్తున్నామని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. బుధవారం పోలీస్ కమిషనరేట్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏఆర్ పోలీస్ అధికారులు, సిబ్బందితో మాట్లాడి సమస్యలను, వినతులను ఒక్కొక్కరిని అడిగి తెలుసుకొని సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చూస్తాం అన్నారు. ఎలాంటి సమస్య ఉన్నా దర్బార్ లో చెప్పడం ఇబ్బందిగా ఉంటే ఆఫీస్ కి వచ్చి నేరుగా కలిసి చెప్పవచ్చు అన్నారు. మనమందరం ఒక కుటుంబమని, అందరం సమన్వయంతో క్రమశిక్షణ, ప్రణాళిక బద్దంగా డ్యూటీలను నిర్వర్తించాలని అన్నారు. రామగుండం కమిషనరేట్ కి, తెలంగాణ పోలీస్ మంచి పేరు తీసుకురావాలన్నారు. సిబ్బంది క్రమశిక్షణతో, మంచి ప్రవర్తనతో విధులు నిర్వర్తించినప్పుడు అధికారులు తమ వెంట ఉంటామన్నారు. సిబ్బందికి చేయవలసిన విధులు, చేయకూడని పనుల గురించి పలు సూచనలు, ఆదేశాలు చేశారన్నారు.

చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు అలవాటు పడి, విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లైతే, పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించిన శాఖ పరమైన చర్య తీసుకుంటామని అన్నారు. పోలీస్ శాఖ, యూనిఫామ్ మీద గౌరవం ఉంటే చట్ట వ్యతిరేకమైన పనుల మీద ఆలోచన రాదు అన్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉండాలి క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు. మానసిక, శారీరక ఒత్తిడి నుండి దూరం కావాలన్నారు. వ్యక్తిగత కారణాలతో ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లు చాలా ప్రమాదకరమని కొన్ని సందర్బాల్లో ఈ ఒత్తిళ్ల కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోనాల్సి వస్తుందన్నారు. కొన్ని సందర్భాల్లో ఒత్తిళ్లు తట్టుకోలేక క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే ముందు మీ కుటుంబం గురించి ఆలోచించాలని సూచించారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి మెడికల్ క్యాంపు నిర్వహించి సిబ్బంది అధికారులు, వారి కుటుంబ సభ్యులకు హెల్త్ చెకప్ చేయిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సీ. రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్ఐ లు దామోదర్, వామన మూర్తి, సంపత్, ఆర్ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story

Most Viewed