- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
KTR : కేటీఆర్ కు హైకోర్ట్ లో బిగ్ రిలీఫ్

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) కు హైకోర్టు(High Court)లో భారీ ఊరట లభించింది. సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసు కొట్టివేయాలని కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్(Quash Petition) దాఖలు చేయగా.. కేసును క్వాష్ చేస్తూ నేడు ధర్మాసనం తీర్పునిచ్చింది. కాంట్రాక్టర్లు, బిల్డర్ల నుంచి రూ.2500 కోట్లు వసూలు చేసి సీఎం ఢిల్లీకి ముట్టజెప్పారని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కించపరిచేలా మాట్లాడారని, సీఎం స్థాయి వ్యక్తి గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడినందుకు కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో ఎంపీ అనిల్ ఫిర్యాదు చేశారు. కాగా ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై కేసు నమోదు చేశారని, తాను రేవంత్ రెడ్డిని అవమానించేలా మాట్లాడలేదని, తనపై నమోదైన తప్పుడు కేసును కొట్టివేయాలని కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్ట్.. కేటీఆర్ పై నమోదైన కేసును కొట్టివేస్తున్నట్టు తీర్పు వెలువరించింది.