- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.18వే లు ఇవ్వాలి

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: 'ఆశా' కార్యకర్తలకు చట్టపరంగా 18వేల రూపాయల వేతనం ఇవ్వాలని సిఐటీయూ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు దీప్లా నాయక్,నల్లవెల్లి కురుమూర్తి,కిల్లె గోపాల్,సిపిఎం జిల్లా కార్యదర్శి రాములు డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్,సిఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో 'ఆశా' లతో నిర్వహించిన బహిరంగ సభలో వారు మాట్లాడారు. ఆశా లకు పిఎఫ్,ఈఎస్ఐ, గ్రాట్యుటీ,పెన్షన్, అసెంబ్లీలో వారి జీతాలకు ప్రత్యేక గ్రాంటు కేటాయించాలని,కేంద్రం తెచ్చిన లేబర్ కోడ్స్ లను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాంరెడ్డి,వరద గాలన్న,జహంగీర్,సావిత్రి,పద్మ,యాదమ్మ,హైమావతి,తదితరులు పాల్గొని ప్రసంగించారు.పాలమూరు యూనివర్సిటీ లో కళాశాల నిర్మాణం చేస్తున్న చుక్కని రమేష్ సెంట్రీంగ్ పనులు చేస్తుండగా క్రిందపడి తీవ్ర గాయాలతో మృతి చెందాడని,ఆయన కుటుంబానికి కాంట్రాక్టర్ 25 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని సిఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి,భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వరద గాలన్న లు డిమాండ్ చేశారు.