Viral video: ఈ కుక్క తెలివి చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

by D.Reddy |   ( Updated:2025-03-22 14:16:28.0  )
Viral video: ఈ కుక్క తెలివి చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
X

దిశ, వెబ్ డెస్క్: కుక్కలు విశ్వాసానికి ప్రతీక అని తెలిసిందే. అందుకే చాలా మంది ఇళ్లలో కుక్కలను పెంచుకుని, ఇంట్లో మనుషుల్లా చూసుకుంటారు. ఇక శునకాలు విశ్వాసం చూపించటంలోనే కాదు, తెలివితేటలు ప్రదర్శించటంలోనూ ముందుంటాయి. కొన్నిసార్లు ఇవి చేసే పనులు చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తాయి. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఎన్నో వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా కూడా ఇలాంటి ఓ వీడియో వైరల్‌గా మారింది.

ఓ మహిళ తన పెంపుడు కుక్కుతో వాహన టైర్లు నిల్వ చేసిన ప్రదేశానికి వెళ్లింది. అక్కడ తనకు కావాల్సిన టైర్లు ఒక్కొక్కటిగా తీసి నేలపై వేసింది. అలా వేయగానే తన పెంపుడు కుక్క వాటిని నోటితో ఒకదానిపై ఒకటి అమర్చటం ప్రారంభించింది. అనంతరం అన్నింటిని ఒకేసారి తీసుకెళ్లేందుకు వీలుగా ఎంతో తెలివిగా సరిచేసుకుంది. ఇక నోటితో వాటిని తీసుకుని యజమాని వెనకే వెళ్లిపోయింది. ఈ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా, వైరల్‌గా మారింది. ఇక ఈ కుక్క తెలివికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అమేజింగ్ టెక్నిక్, జీనియస్ డాగ్, అంటూ రకరకాల కామెంట్లు పెడుతూ కుక్కను ప్రశంసిస్తున్నారు. మరీ ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

Next Story

Most Viewed