- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు
by Naveena |

X
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: పవిత్ర రంజాన్ మాసాంతం ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత,మత సామరస్యానికి ప్రతీక అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పట్టణంలోని జేజేఆర్ ఫంక్షన్ హాల్లో ప్రముఖ వ్యాపారవేత్త జాఫర్ ఉల్లా సిద్దిక్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విరమింపజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అన్ని మతాలు చెప్పేది ఒక్కటేనని,మనషులంతా సోదర భావంతో కలిసి మెలిసి ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మిథున్ రెడ్డి,ఎన్పీ వెంకటేష్,మారేపల్లి సురేందర్ రెడ్డి,మక్సూద్,సదర్ ఖాజీ,గౌస్ మోయిద్దీన్,జాకీర్,జాబేర్,రఫీక్ పటేల్,మొయిన్ అలీ,ఎంఐఎం జవీర్,తదితరులు పాల్గొన్నారు.
Next Story