వివాహేతర సంబంధం కోసం... కన్న తండ్రినే కడతేర్చిన కూతురు

by srinivas |
వివాహేతర సంబంధం కోసం... కన్న తండ్రినే కడతేర్చిన కూతురు
X

దిశ, వెబ్ డెస్క్: అంబేద్కర్ కోనసీమ(Ambedkar Konaseema) జిల్లాలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం(extramarital affair) కోసం కన్నతండ్రినే కూతురు కడతేర్చారు. ఈ ఘటన రామచంద్రాపురం జరిగింది. స్థానికుడు సురా రాంబాబు కుమార్తె కొత్తూరు గ్రామానికి చెందిన సురేశ్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఈ విషయం తండ్రి రాంబాబుకు తెలిసింది. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సురేశ్‌తో వివాహేతర సంబంధంపై కూతుర్ని నిలదీశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో కూతురు రగిలిపోయింది.

తండ్రి నిద్రపోతున్న సమయంలో ప్రియుడికి ఫోన్ చేసి సురేశ్‌కు విషయం చెప్పారు. వెంటనే తన స్నేహితుడు నాగార్జునతో కలిసి రామచంద్రాపురానికి సురేశ్ వెళ్లారు. ముగ్గురు నిద్ర పోతున్న రాంబాబును గొంతు నొక్కి చంపేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. దీంతో రాంబాబు తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. విశాఖ పారిపోతున్న నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Next Story

Most Viewed