- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ లకు… ఎన్ఎస్ జీ, ఆక్టోపస్, మౌంటెడ్ పోలీసులతో గస్తీ

దిశ, సిటీక్రైం : స్టేడియంలోకి వెళ్ళే ప్రతి ప్రేక్షకుడి మొబైల్ ఫోన్ లను తనిఖీ చేసేందుకు ప్రతి గేటు వద్ద 4 టెక్నీషియన్ లతో తనిఖీ చేయనున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు శుక్రవారం తెలిపారు. టాటా ఐపీఎల్ 18 వ ఎడిషన్ క్రికేట్ టోర్నమెంట్ లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో 9 మ్యాచ్ లు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో స్టేడియం వద్ద 2700 మంది సిబ్బందితో పోలీసు పహారాను మొహరిస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. ఎన్ ఎస్ జీ, ఆక్టోపస్ , మౌంటెడ్ పోలీసులతో ప్రత్యేక గస్తీని నిర్వహిస్తున్నామన్నారు. పోలీసులు అమలు చేస్తున్న నిబంధనలను మ్యాచ్ వీక్షణానికి వచ్చే ప్రేక్షకుడు పాటించాలన్నారు. అదే విధంగా ప్రేక్షకులకు అన్ని సౌకర్యాలను కల్పించేలా హెచ్ సీ ఏ తో పాటు , సన్ రైజర్స్ మేనేజ్మెంట్ ఏర్పాట్లను చేసుకోవాలన్నారు. లాప్ టాప్స్, కర్రలతో కూడిన బ్యానర్స్, వాటర్ బాటిల్స్, కెమెరాలు, సిగరేట్ లు, గొడుగులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, మ్యాచ్ బాక్స్, లైటర్స్, పదునైనా ప్లాస్టిక్, ఇనుము వస్తువులు, పెన్స్, బాటరీస్, హెల్మెట్స్ , పర్ ఫ్యూమ్స్ , బయట తినుబండారాలు స్టేడియంలోకి అనుమతి లేదన్నారు. మ్యాచుల సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడకుండా కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీపీ చెప్పారు. ఈ సమావేశంలో హెచ్ సీఏ, సన్ రైజర్స్ ప్రతినిధులు , మల్కాజిగిరి డీసీపీ పద్మజ పాల్గొన్నారు.