ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్

by Kalyani |
ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్
X

దిశ, నారాయణఖేడ్ : సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ మండలం ర్యాల మడుగు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉంది. కామారెడ్డి జిల్లాకు చెందిన బొలెరో వాహనం లారీని ఢీకొనడంతో తీవ్ర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనం డ్రైవర్ వాజిద్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని నారాయణఖేడ్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Next Story

Most Viewed