Mahmood Akram:19 ఏళ్లకే ప్రపంచ రికార్డు.. దేంట్లో అంటే?

by Jakkula Mamatha |   ( Updated:2025-03-19 11:10:04.0  )
Mahmood Akram:19 ఏళ్లకే ప్రపంచ రికార్డు.. దేంట్లో అంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో మాతృభాష(mother tongue)తో పాటు ఇతర భాషలు ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. విదేశాల్లో జాబ్స్(Jobs) సాధించాలనుకునే వారికి తప్పనిసరిగా ఇతర భాషలు కూడా వచ్చి ఉండాలి. ఈ క్రమంలో చాలామంది కమ్యూనికేషన్ స్కిల్స్(Communication skills) మెరుగుపరుచుకోవడానికి శిక్షణ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ తరుణంలో మాతృభాషతో పాటు మరో రెండు మూడు భాషలు రావడమే గొప్ప. కానీ.. భాషలపై ఆసక్తితో చెన్నైకి చెందిన 19 ఏళ్ల మహ్మూద్ అక్రమ్ 400 భాషల్లో ఏకంగా రాయడం, టైప్ చేయడం నేర్చుకోని ఔరా అనిపించారు. ఆయన 46 భాషల్లో అనర్గళంగా మాట్లాడుతారు.

తనకు నాలుగేళ్లు ఉన్నప్పటి నుంచే ఇతర భాషలు(languages) నేర్చుకోవడం స్టార్ట్ చేసి 8 ఏళ్లకే బహుభాష టైపిస్ట్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. తండ్రి మోజిప్రియాన్ ప్రభావంతో 16 భాషలు అందిపుచ్చుకున్నాడు. ఆరేళ్లకే టైప్ రైటింగ్ నేర్చుకొని, ఎనిమిదేళ్లకే ఇంటర్నెట్ సహాయంతో 50 భాషలు నేర్చుకున్నాడు. యూనివర్సల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ 50 భాషల్లో టైపింగ్‌లో ప్రపంచ రికార్డు సాధించాడు. మహ్మూద్ అక్రమ్ వర్క్స్ ‌షాప్స్ ఏర్పాటు చేసి చాలా మంది విద్యార్థులకు నైపుణ్యం అందిస్తున్నారు. అంతేకాదు తిరుక్కురల్ మరియు తోల్కాప్పియం వంటి తమిళ క్లాసిక్‌లను వీలైనన్ని ఎక్కువ భాషలలోకి అనువదించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.



Next Story

Most Viewed