- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అమెరికాను చిత్తు చేసిన భారత్.. ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్‌లో ఖాతా ఓపెన్
దిశ, స్పోర్ట్స్ : ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్‌లో భారత మహిళల హాకీ జట్టు పుంజుకుంది. హ్యాట్రిక్ ఓటములను చవిచూసిన భారత జట్టు టోర్నీలో ఎట్టకేలకు గెలుపు ఖాతా తెరిచింది. శుక్రవారం భువనేశ్వర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో అమెరికాను 1-3 తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో మొదటి నుంచి భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. 9వ నిమిషంలోనే వందన ఫీల్డ్ గోల్ చేసి జట్టుకు తొలి గోల్ అందించింది. ఆ తర్వాత దీపిక 26వ నిమిషంలో గోల్ చేయడంతో భారత్ ఆధిక్యం 2-0కి పెరిగింది. మూడో క్వార్టర్‌లో అమెరికా తొలి గోల్ చేసింది. 42వ నిమిషంలో కార్ల్స్ సన్నే గోల్ చేసి భారత్ ఆధిక్యాన్ని 2-1కు తగ్గించింది. ఈ మ్యాచ్‌లో అమెరికాకు అదే ఏకైక గోల్. ఆ తర్వాత అమెరికాను భారత్ నిలువరించింది. అదే సమయంలో 56వ నిమిషంలో సలీమ గోల్ చేయడంతో 3-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి వరకూ ఆధిక్యాన్ని కాపాడుకుని విజేతగా నిలిచింది. కాగా, టోర్నీలో భారత్ తన తదుపరి మ్యాచ్‌లో ఈ నెల 12న చైనాతో తలపడనుంది.