వరల్డ్ కప్ ఆడనప్పుడు నేనెందుకు ఆలోచించాలి : రియాన్ పరాగ్ కీలక వ్యాఖ్యలు

by Harish |
వరల్డ్ కప్ ఆడనప్పుడు నేనెందుకు ఆలోచించాలి : రియాన్ పరాగ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్, అసోంకు చెందిన రియాన్ పరాగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తనకు టీ20 వరల్డ్ కప్ చూడాలనే ఇంట్రెస్ట్ లేదని వ్యా్ఖ్యానించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రియాన్ పరాగ్‌కు టీ20 ప్రపంచకప్‌లో టాప్-4 జట్లు గురించి ప్రశ్నించగా.. తాను వరల్డ్ కప్ ఆడనప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని సమాధానమిచ్చాడు.

‘టాప్-4 జట్లపై ఇప్పుడే మాట్లాడితే పక్షపాతం చూపించినట్టు అవుతుంది. నిజాయతీగా చెప్పాలంటే అసలు నాకు ప్రపంచకప్‌ను చూడాలనే లేదు. ఎవరు గెలుస్తారనేది మాత్రమే చూస్తా. దాంతోనే సంతోషపడతా. నేను వరల్డ్ కప్ ఆడుంటే, టాప్-4 జట్లతోపాటు అన్నింటి గురించి ఆలోచించేవాడిని.’ అని చెప్పుకొచ్చాడు. కాగా, ఐపీఎల్-17లో రాజస్థాన్ తరపున రియాన్ పరాగ్ సత్తాచాటాడు. 14 ఇన్నింగ్స్‌ల్లో 573 పరుగులు చేసి టాప్ స్కోరర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. దీంతో టీ20 ప్రపంచకప్ జట్టులో అతనికి చోటు దక్కతుందని వార్తలు వచ్చినా.. సెలెక్టర్లు అతన్ని పక్కనపెట్టారు.

Advertisement

Next Story

Most Viewed