- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైట్‌బాల్ క్రికెట్‌లో కోహ్లీని మించినోడు లేడు.. విరాట్‌పై జేమ్స్ అండర్సన్ ప్రశంసలు
దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ మాజీ పేసర్ జేమ్స్ అండర్సన్ టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. వైట్‌బాల్ క్రికెట్‌లో విరాట్ గ్రేటెస్ట్ ఫినిషర్ అని అభివర్ణించాడు. చేజింగ్‌లో అతనిలాంటి బ్యాటర్‌ను చూడలేదని చెప్పాడు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న అండర్సన్.. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో కోహ్లీ చేజింగ్ నైపుణ్యాల గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. ‘సెకండ్ బ్యాటింగ్‌కు దిగి స్కోర్లను ఛేదించడంలో విరాట్ కోహ్లీ రికార్డు అపూర్వం. చేజింగ్‌లో అతని కంటే బెటర్ బ్యాటర్ చరిత్రలో ఉన్నారో లేరో నాకు తెలియదు. అతను చాలా శతకాలు సెకండ్ బ్యాటింగ్‌లోనే చేశాడు.’ అని తెలిపాడు.
విరాట్‌కు ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ అని, అదే అతని అద్భుతమైన చేజింగ్ నైపుణ్యాలకు తోడ్పడుతుందని చెప్పాడు. ఆ పాడ్‌కాస్ట్‌లో గ్రేటెస్ట్ వైట్ బాల్ ఫినిషర్‌గా కోహ్లీని చూడొచ్చా? అని అడగ్గా.. అండర్సన్ స్పందిస్తూ చేజింగ్‌లో విరాట్ చేసిన సెంచరీలు అతన్ని ‘గ్రేటెస్ట్ ఫినిషర్’గా నిలబెట్టాయని చెప్పాడు.
‘నేను చేజింగ్ గురించే మాట్లాడుతున్నా. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ బెవాన్ 1990-2000లో 6వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి మ్యాచ్‌లను ముగించేవాడు. కానీ, కోహ్లీ 3వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఆ పని చేస్తున్నాడు. పైగా శతకాలు బాదాడు. నిజాయతీగా చెబుతున్నా కోహ్లీ బెటర్ ఫినిషర్ మాత్రమే కాదు గ్రేటెస్ట్ వైట్‌బాల్ ప్లేయర్ కూడా. ఆ విషయంలో నేను అతని కంటే మెరుగైన వ్యక్తిని చూడలేదు.’ అని చెప్పుకొచ్చాడు. కాగా, 42 ఏళ్ల అండర్సన్ గత నెలలో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో వెస్టిండీస్‌తో చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు.