- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆరంభం అదిరింది.. బ్యాడ్మింటన్ ఆసియా మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత్ బోణీ
అబుదాబి: భారత షట్లర్లు అదరగొట్టారు. బ్యాడ్మింటన్ ఆసియా మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. మంగళవారం జరిగిన గ్రూపు-బి మ్యాచ్‌లో భారత్ 5-0 తేడాతో కజకస్థాన్‌ను చిత్తుగా ఓడించింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లోనే ఇషాన్ భట్‌నగర్-తనీషా క్రాస్టో జోడీ భారత్‌కు శుభారంభం అందించింది. మఖ్సూత్ తజిబుల్లావ్-నర్గీజా రఖ్మేతుల్లయేవ జోడీని 21-5, 21-11 తేడాతో ఓడించింది.
ఆ తర్వాత మెన్స్ సింగిల్స్ మ్యాచ్‌లో ప్రణయ్ భారత్‌ను లీడ్‌లోకి తీసుకెళ్లాడు. కజకస్థాన్ ఆటగాడు డిమిత్రి పనారిన్ 21-9, 21-11 తేడాతో వరుస గేమ్‌లను సొంతం చేసుకున్నాడు. విజయం ఖాయం చేసిన సింధు. వరుసగా రెండు మ్యాచ్‌లు నెగ్గి లీడ్‌లో ఉన్న భారత్‌కు స్టార్ షట్లర్ పీవీ సింధు విజయాన్ని ఖాయం చేసింది. ఉమెన్స్ సింగిల్స్ మ్యాచ్‌లో సింధు 21-4, 21-12 తేడాతో కమిలా స్మాగులోవాను మట్టికరిపించింది.
వరుస గేముల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సింధు 20 నిమిషాల్లోనే ప్రత్యర్థిని ఓడించింది. సింధు గెలుపుతో వరుసగా మూడు మ్యాచ్‌లు నెగ్గిన భారత్ 3-0 తేడాతో విజయాన్ని ఖరారు చేసుకుంది. ఆ తర్వాత జరిగిన మెన్స్ డబుల్స్ మ్యాచ్‌లో క్రిష్ణ ప్రసాద్-విష్ణువర్ధన్ జోడీ 21-10, 21-6 తేడాతో ఖైత్మురత్ కుల్మాటోవ్-ఆర్తుర్ నియాజోవ్ జోడీపై గెలుపొందడంతో భారత్ 4-0తో భారీ ఆధిక్యతతో క్లీన్‌స్వీప్ దిశగా వెళ్లింది.
ఇక, ఆఖరి మ్యాచ్ ఉమెన్స్ డబుల్స్‌లో భారత ద్వయం ట్రీసా జాలీ-గాయత్రి గోపిచంద్ 21-5, 21-7 తేడాతో నర్గీజా రఖ్మేతుల్లయేవ-ఐషా జుమాబెక్‌పై విజయం సాధించింది. దాంతో భారత్ 5-0 తేడాతో కజకస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. నేడు జరగబోయే మ్యాచ్‌లో టీమ్ ఇండియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)తో తలపడనున్నది.